దిశతో సమాజానికి మెరుగైన దశ!

by Kalyani |
దిశతో సమాజానికి మెరుగైన దశ!
X

దిశ, వరంగల్‌ టౌన్ : వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తూ మెరుగైన సమాజ నిర్మాణానికి దిశ దినపత్రిక అలుపెరగని అక్షర పోరాటం సాగిస్తున్నదని వరంగల్‌ ఏనుమాముల మార్కెట్‌ ఉన్నత శ్రేణి కార్యదర్శి పోలెపాక నిర్మల, తహసీల్దార్‌ ఇక్బాల్‌, బల్దియా ప్రజారోగ్య అధికారులు రాజారెడ్డి, రాజేష్ పేర్కొన్నారు. దిశ దినపత్రిక రూపొందించిన ఈ ఏడాది క్యాలెండర్‌ను గురువారం వారు వారి కార్యాలయాల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… నిత్యం ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూ దిశ దినపత్రిక ప్రజలకు రోజురోజుకు చేరువవుతున్నదని అన్నారు. నిరంతర, నిర్విరామ అక్షర పోరాటంతో ఎన్నో సమస్యలను వెలికితీస్తున్న దిశ దినపత్రిక సమాజ హేతువుగా మారిందన్నారు. ఏ చిన్న సమస్య అయినా దిశ దినపత్రిక తమ దశ మారుస్తుందన్న నమ్మకం ప్రజల్లో నానాటికీ పెరుగుతున్నదన్నారు. ఆ విశ్వాసమే ఆయుధంగా దిశ దినపత్రిక మరిన్ని మైలురాళ్లను అధిగమించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డిటి సుమన్,ఆర్ ఐ కృష్ణస్వామి,రజిత,ఏనుమాముల మార్కెట్ గ్రేడ్ 2 కార్యదర్శులు శ్రీరామోజు. రాము, అంజిత్ రావు, సూపర్వైజర్లు గంగాధర్, సాగర్, వినయ్, చక్రబహుదూర్, బల్దియా ప్రజారోగ్య విభాగం సూపర్వైజర్ నరేందర్, మార్కెట్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed