- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జిల్లా యంత్రాంగానికి ప్రజలు,పాత్రికేయులు సహకరించాలి : జిల్లా కలెక్టర్
దిశ, ములుగు ప్రతినిధి: గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో జిల్లా కలెక్టర్ దివాకర,అదనపు కలెక్టర్ రెవెన్యూ సి. హెచ్. మహేందర్ జి తో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేశారని, జిల్లాలోని పర్యాటక రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. క్రింది స్థాయి అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారి వరకు మంచి పనులతో పాటు అనుకోకుండా కొన్ని తప్పుడు పనులు చేసే అవకాశం ఉంటుందని, ఇలాంటి విషయాలను పాత్రికేయులు తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులు కుటుంబాల పోషణతో పాటు ప్రజా సేవ చేయాలని తపనతో ప్రభుత్వ ఉద్యోగ విధులు నిర్వహిస్తారని, తాను సైతం కలెక్టర్ కాక ముందు ప్రైవేట్ కంపెనీలో నెలకు ఆరు లక్షల 50 వేల రూపాయల వేతనం తో పని చేశానని ప్రజలకు సేవ చేయాలనే తపనతో కలెక్టర్ ఉద్యోగంలో చేరానని వివరించారు.
జిల్లాలో మూతపడిన బిల్ట్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించడానికి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకోగా, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రభుత్వానికి సమర్పించడం జరిగిందని, జిల్లాలో 4 వందల ఎకరాల స్థలంలో పలు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడంతో పాటు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో విద్యను బలోపేతం చేయడానికి సిఎస్ఆర్ నిధులతో గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థిని విద్యార్థులకు నూతన పరిజ్ఞానంతో బోధన అందించడం జరుగుతున్నదని, జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి జిల్లా యంత్రాంగం ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతుందని వివరించారు. జిల్లాలో ప్రజలు ఎలాంటి సమస్యలకు గురైన పాత్రికేయులు తన దృష్టికి తీసుకురావాలని తాను నిత్యం అందుబాటులో ఉంటానని దివాకర తెలిపారు. ఈ పాత్రికేయుల సమావేశంలో జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి ఎండి. రఫిక్, జూనియర్ అసిస్టెంట్ కే.శంకర్ తదితరులు పాల్గొన్నారు.