Noida : నోయిడాలో పాఠశాలలు తాత్కాలిక మూసివేత.. కారణమిదే..!

by Sathputhe Rajesh |   ( Updated:2025-01-02 16:26:01.0  )
Noida : నోయిడాలో పాఠశాలలు తాత్కాలిక మూసివేత.. కారణమిదే..!
X

దిశ, నేషనల్ బ్యూరో : నోయిడాలో పాఠశాలలను తదుపరి ఆదేశాలు వెలువడేవరకు మూసి ఉంచాలని విద్యాశాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. స్టేట్ బోర్డు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పరిధిలోని స్కూల్స్ 8వ తరగతి వరకు క్లాసులు నిర్వహించకూడదని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. దట్టమైన పొగమంచు, చలి తీవ్రత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ తెలిపింది. స్టేట్ బోర్డు పరిధిలో రిజిస్టర్ అన్ని పాఠశాలలకు ఈ షరతు వర్తిస్తుందని తాజాగా వెలువడిన ఆదేశాల్లో ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది. గత కొన్ని రోజులుగా చలి తీవ్రత విపరీతంగా పెరుగుతోందని.. దీంతో పిల్లలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని తెలిపింది. నిబంధలను అతిక్రమించిన పాఠశాలలపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ హెచ్చరించింది. మరోవైపు నొయిడాలో ఉష్ణోగ్రతలు 8 నుంచి 17 డిగ్రీల మధ్య కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నేటి నుంచి ఈ నెల 6 వరకు నొయిడాను దట్టమైన పొగమంచు కప్పేస్తుందని స్పష్టం చేసింది.

Read More ....

China: చైనాలో మళ్లీ హెల్త్ ఎమర్జన్సీ !


Next Story

Most Viewed