MLC కవిత విజ్ఞప్తికి పోలీస్ శాఖ గ్రీన్ సిగ్నల్

by Gantepaka Srikanth |
MLC కవిత విజ్ఞప్తికి పోలీస్ శాఖ గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ(MLC) కల్వకుంట్ల కవిత(Kavitha) విజ్ఞప్తిపై రాష్ట్ర పోలీస్ శాఖ(Police Department) సానుకూలంగా స్పందించింది. హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద గురువారం చేపట్టబోయే బీసీ సభ(BC Sabha)కు అనుమతి మంజూరు చేసింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు సభ నిర్వహించుకోవడానికి అనుమతులు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. కవిత చేపట్టే ధర్నాకు సర్పంచ్‌ల సంఘం జేఏసీ, తెలంగాణ విద్యార్థి జేఏసీ(Student JAC) మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. బీసీ మహాధర్నాకు జిల్లాల నుంచి భారీ స్పందన లభిస్తోందని చెప్పారు. బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపడుతున్నట్లు ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed