Delhi: ఎన్నికల్లో పోటీకి ప్రజల ఆర్థిక సాయం కోరిన సిసోడియా

by S Gopi |
Delhi: ఎన్నికల్లో పోటీకి ప్రజల ఆర్థిక సాయం కోరిన సిసోడియా
X

దిశ, నేషనల్ బ్యూరో: త్వరలో దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ ఆప్ మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రజల నుంచి ఆర్థిక సాయం కోరుతూ ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీలోని జంగ్‌పుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన, ప్రజల నుంచి మద్దతు కోరుతూ ఆన్‌లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా తనకు ఆర్థిక సాయం చేయాలని, ప్రజల మద్దతుతోనే తాను ఇన్నేళ్లు గెలిచానని, ఈసారి కూడా సాయం కావాలన్నారు. ప్రజలందించే విరాళాలతోనే ఢిల్లీలో ఉద్యోగ, విద్యా పురోగతి అని సిసోడియా వెల్లడించారు. కాగా, గతేడాది ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సిసోడియా 17 నెలల పాటు జైలు శిక్ష అనుభవించిన సంగతి తెలిసిందే. ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు.

Advertisement

Next Story

Most Viewed