- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రభుత్వం కీలక నిర్ణయం.. జనవరి 3న తెలంగాణ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం
దిశ, వెబ్ డెస్క్: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు చేస్తుంది. అలాగే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కీలక నిర్ణయాలు(Key decisions) తీసుకుంటుంది. ఇందులో భాగంగా పలు పేర్లు మార్పులతో పాటు రాష్ట్ర గీతం, తెలంగాణ తల్లి విగ్రహం రూపు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా మార్పులు చేసినట్లు తెలిపింది. కాగా తాజాగా కూడా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సావిత్రిబాయి పూలే జయంతి(Savitribai Phule Jayanti)ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం(Women Teacher's Day)గా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం అధికారిక ఉత్తర్వులు(Official orders) జారీ చేసింది. దీంతో రేపు జనవరి 3న సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా తెలంగాణ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం(Telangana Women Teacher Day)గా నిర్వహించనున్నారు.