ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే ఊరుకునేది లేదు.. : మునుగోడు ఎమ్మెల్యే

by Aamani |
ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే ఊరుకునేది లేదు.. : మునుగోడు ఎమ్మెల్యే
X

దిశ, మునుగోడు : మునుగోడు నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే ఊరుకునేది లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. గురువారం మండల కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యాలయంలో నిర్వహించిన రెవెన్యూ అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల కేంద్రాలలో ప్రభుత్వ కార్యాలయాన్ని ఒకే చోట నిర్మించేలా, విద్యా సంస్థలన్నీ ఓకే ప్రాంగణంలో ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని, ఆయా మండల కేంద్రాలలో ఎంత ప్రభుత్వం భూమి ఉన్నదో సర్వే చేసి పొజిషన్ తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు సూచించారు.

గత పది సంవత్సరాలుగా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని, దొంగ పట్టాలు సృష్టించి ప్రభుత్వ భూములు కబ్జా చేశారని, వాటిని గుర్తించి రికవరీ చేయాలని అవసరమైతే వారిపై కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు తెలిపారు. ఇప్పటి నుండి ఏ ఒక్కరైనా ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే ఊరుకునేది లేదని కబ్జా చేసేవారు మా పార్టీవారైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఈ సమీక్ష సమావేశంలో చండూరు ఆర్డీవో శ్రీదేవి, మునుగోడు తహశీల్దార్ నరేందర్, ఆర్ ఐ నాగరాజు, చండూరు మున్సిపల్ కమిషనర్ లు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed