Judgeship : జడ్జీల సమీప బంధువులకు హైకోర్టు జడ్జీలుగా నో ఛాన్స్.. ‘సుప్రీం’ కొలీజియం యోచన

by Hajipasha |
Judgeship : జడ్జీల సమీప బంధువులకు హైకోర్టు జడ్జీలుగా నో ఛాన్స్.. ‘సుప్రీం’ కొలీజియం యోచన
X

దిశ, నేషనల్ బ్యూరో : సుప్రీంకోర్టు కొలీజియం(SC collegium) మరో విప్లవాత్మక సంస్కరణ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. హైకోర్టుల జడ్జీలు(HC judgeship) లేదా రిటైర్డ్ హైకోర్టు జడ్జీల సమీప బంధువులకు హైకోర్టు న్యాయమూర్తులుగా అవకాశాన్ని కల్పించే అంశాన్ని సుప్రీంకోర్టు కొలీజియం వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. లీగల్ ప్రొఫెషన్‌లోని తొలితరం వారికి, అన్ని సామాజిక వర్గాల వారికి న్యాయ వ్యవస్థలో కీలక పాత్ర పోషించే అవకాశాన్ని కల్పించే గొప్ప సంకల్పంతో ఈ సంస్కరణను కొలీజియం పరిశీలిస్తోందని అంటున్నారు.

తల్లిదండ్రులు లేదా బంధువుల్లో ఎవరైనా ఇప్పటికే హైకోర్టు లేదా సుప్రీంకోర్టుల్లో జడ్జీలు(judges)గా ఉన్నవారు.. న్యాయమూర్తుల పోస్టులకు అప్లై చేస్తే వారి పేర్లను తమకు సిఫార్సు చేయొద్దని హైకోర్టు కొలీజియంలకు సుప్రీంకోర్టు కొలీజియం నిర్దేశించే అవకాశం ఉంది. ఈమేరకు మార్పులు అమల్లోకి వస్తే కొంతమంది అర్హులైన వారు జడ్జీలు అయ్యే అవకాశాలను కోల్పోయే ముప్పు ఉందనే ఆందోళన కూడా పలువురిలో వ్యక్తమవుతోంది.

Advertisement

Next Story

Most Viewed