- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ ఇయర్ దేశంలోనే టాప్ సాంగ్ ఏదో తెలుసా..? అస్సలు ఊహించి ఉండరుగా..!(పోస్ట్)
దిశ, సినిమా: ఈ ఇయర్ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సినిమాల్లో ‘గుంటూరు కారం’ ఒకటి. మహేష్ బాబు, శ్రీ లీల జంటగా నటించిన ఈ చిత్రానికి డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. ఇక అమ్మ సెంటిమెంట్‌గా రూపొందిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరీ, ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ, రావు రమేష్, జయరామ్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. స్టోరీ పరంగా మంచి టాక్ తెచ్చుకున్న గుంటూరు కారం సినిమా పాటల పరంగా అయితే ఇంకా చెప్పనక్కర్లేదు.
తమన్ అందించిన పాటలు మ్యూజిక్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో కుర్చీని మడత పెట్టి అనే పాటకు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ఈ సాంగ్ ఊహించని సెన్సేషన్‌ను సెట్ చేసింది. మరి ఇది ఎంత వరకు వెళ్లిదంటే యూట్యూబ్‌లో ఈ 2024లో గ్లోబల్ వైడ్‌గా టాప్‌లో వచ్చిన పాట లిస్ట్‌లో నిలిచింది. అనేక దేశాల్లో టాప్ సాంగ్స్‌తో పాటుగా మన దేశం నుంచి కుర్చీ మడతపెట్టి సాంగ్ ఒకటే నిలిచి సెన్సేషనల్ రికార్డు వ్యూస్ అందుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ తమన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా మొత్తానికి ఈ పాట మాత్రం ఊహించని రికార్డు సెట్ చేసిందనే చెప్పవచ్చు