- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కానిస్టేబుల్ ఆత్మహత్య కేసులో BIG ట్విస్ట్..?
దిశ, కొల్చారం : కొల్చారం పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సాయి కుమార్ శనివారం రాత్రి స్టేషన్ ముందున్న ఎస్సై క్వార్టర్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయికుమార్ రెండు సంవత్సరాల క్రితం జరిగిన బదిలీలలో కొల్చారం పోలీస్ స్టేషన్ కు హెడ్ కానిస్టేబుల్ గా వచ్చాడు. గుంటూరు జిల్లాకు చెందిన సాయి కుమార్ కు సంగారెడ్డి జిల్లా జోగిపేట కు చెందిన లక్ష్మి తో వివాహం జరగడంతో జిల్లాలోని నర్సాపూర్ ప్రాంతంలో సుదీర్ఘ కాలం పనిచేయడంతో నర్సాపూర్ పట్టణంలో ఇల్లు నిర్మించుకొని గత కొన్ని సంవత్సరాలుగా నర్సాపూర్ లో నివసిస్తున్నాడు.
నర్సాపూర్ పట్టణానికి చెందిన ఒక మహిళతో వివాహేతర సంబంధం హెడ్ కానిస్టేబుల్ సాయి కుమార్ కు ఉంది. గత కొన్ని రోజులుగా సాయికుమార్ వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ భర్త సాయి కుమార్ ను డబ్బుల కోసం వేధింపులకు గురి చేస్తు, డబ్బులు ఇవ్వకుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరింపులకు గురి చేస్తుండడంతో ఆందోళనకు గురైయ్యాడు. గత కొన్ని రోజులుగా తన చావే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతదని అంటూ, ఆత్మహత్య చేసుకుంటా అంటూ ఇంట్లో చెప్పాడని కుటుంబీకులు పోలీసులకు, కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ కి సమాచారం ఇచ్చారు.
దీంతో ఎస్ఐ గౌస్ సాయి కుమార్ తో రెండు రోజుల క్రితం మాట్లాడారు. రెండు రోజుల్లో తానే సమస్యను పరిష్కరించు కుంటానని తెలపడంతో ఈ విషయం ఎస్సై హెడ్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు తెలిపారు. కాగా శనివారం రాత్రి విధులకు వచ్చిన సాయి కుమార్ అందరూ నిద్రించిన సమయంలో స్టేషన్ ముందున్న పాడుబడిన ఎస్సై క్వార్టర్ వెనుక భాగంలోనున్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటన స్థలం ను మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ సందర్శించారు. వెంటనే కొల్చారం పోలీసులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.