- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Plane Crash: 179కి చేరిన మృతుల సంఖ్య.. విమాన ప్రమాదానికి కారణమిదే!
దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ కొరియా(South Korea)లోని ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయం(Mueang International Airport)లో విమానం ల్యాండ్ అవుతూ అదుపుతప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గోడను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం 179 మంది మృతిచెందారు. ఇందులో ప్రయాణికులతో పాటు విమాన సిబ్బంది కూడా ఉన్నారు. ఈ ఘోర ప్రమాదానికి కారణం ల్యాండింగ్ గేర్ వైఫల్యమే అని ప్రాథమికంగా తెలుస్తోంది. థాయ్ రాజధాని బ్యాంకాక్(Bangkok) నుంచి బయల్దేరిన ది జేజు ఎయిర్ ఫ్లైట్‌కు చెందిన 7C2216 నంబర్ బోయింగ్ 737-800 శ్రేణి విమానం ల్యాండ్ అవుతూ అదుపుతప్పింది. రక్షణ గోడను ఢీకొని మంటల్లో చిక్కుకొని పేలిపోయింది. విమానం ల్యాండ్ కావడానికి ప్రయత్నించిన సమయంలో ల్యాండింగ్ గేర్ సమస్యతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇద్దరు సిబ్బంది తప్ప మిగిలిన వారంతా మరణించినట్లు తెలుస్తోంది.