- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Odisha: రోజుకు మూడు బాల్య వివాహాలు.. ఏ రాష్ట్రంలో అంటే?

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశాలో బాల్య వివాహాలు (Child marriages) ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత ఆరేళ్లలో ప్రతి రోజూ సుమారు మూడు బాల్య వివాహాలు నమోదయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా వివరాలు వెల్లడించింది. 2019 నుంచి 2025 ఫిబ్రవరి వరకు ఒడిశాలో మొత్తం 8,159 బాల్య వివాహాలు జరిగినట్టు ప్రభుత్వం తెలిపింది. వాటిలో నబరంగ్ పూర్ (Nabarangpur) జిల్లాలోనే 1347 కేసులు నమోదయ్యాయి. ఒడిశాలోని 30 జిల్లాల్లో ఈ ప్రాంతంలోనే అత్యధికంగా చైల్డ్ మ్యారేజెస్ నమోదు కావడం గమనార్హం. గంజాం జిల్లా 966 కేసులతో రెండో స్థానంలో ఉండగా, కోరాపుట్ 636 కేసులతో తరువాతి స్థానంలో ఉంది. ఆ తర్వాత మయూర్‌భంజ్‌లో 594, రాయ్‌గఢ్‌లో 408, బాలాసోర్ 361, కియోంఝర్ 328, కంధమాల్, నయాగఢ్‌లో 308 బాల్య వివాహాలు రికార్డయ్యాయి. ఝార్సుగూడ జిల్లాలో అత్యల్పంగా 57 కేసులు నమోదయ్యాయి. ఒడిశా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నప్పటికీ బాల్య వివాహాలు అత్యధికంగా జరగడం ఆందోళన కలిగిస్తోంది. అయితే గత ఆరేళ్లలో 328 మంది పిల్లలకు అధికారులు రక్షించారు. 2019-20లో 85 మందిని రక్షించగా, 2020-21 2021-22లో వరుసగా 4, 43 మందిని రక్షించినట్లు డేటా వెల్లడించింది.
ప్రభుత్వం డేటాపై సామాజిక కార్యకర్త నమ్రతా చద్దా స్పందించారు. ‘బాల్య వివాహాలను రాత్రికి రాత్రే పూర్తిగా ఆపలేము. ఆడపిల్లలు, వారి తల్లిదండ్రులకు ఈ తరహా సమస్యలపై అవగాహన కల్పించాలి. మైనర్ పిల్లలకు వివాహం చేయడం గిరిజనుల సాంప్రదాయ ఆచారం. ముఖ్యంగా దుర్బల గిరిజన సమూహాలకు ఇది ఒక కారణం’ అని పేర్కొన్నారు. జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే తల్లిదండ్రులు తమ అమ్మాయిల భవిష్యత్తును కాపాడుకోవడానికి, వారి భద్రత కోసం చట్టబద్ధమైన వయస్సుకు ముందే వివాహం చేస్తున్నారని, ఎందుకంటే ఆ అమ్మాయి కుటుంబానికి అవమానం కలిగించే వ్యక్తితో పారిపోతుందనే భయంతో వారు వివాహాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం మరింత అవగాహన కల్పిస్తే బాల్య వివాహాలను అరికట్టొచ్చని అభిప్రాయపడ్డారు.