- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Ap: ఏప్రిల్ 2న రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాప్టో ధర్నా

దిశ, వెబ్ డెస్క్: పెండింగ్ బకాయిల సాధన కోసం ఫ్యాప్టో పోరుబాట పట్టనుంది. నూతన వేతన సవరణ సంఘం, మధ్యంతర భృతి వెంటనే ఇవ్వాలంటూ ఏప్రిల్ 2న రాష్ట్రవ్యాప్తంగా ధర్నా నిర్వహించాలని పిలుపునిచ్చింది. అన్ని కలెక్టరేట్ కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేయాలని సూచించింది. నాలుగేళ్ల నుంచి ఆపేసిన పీఎఫ్, ఏపీజీఎల్‌ఐ లావాదేవీలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేసింది. వైద్యం, చదువులు, పెళ్లి ఖర్చులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, పాక్షికంగా విత్ డ్రా చేసుకునేందుకు అనుమతులు ఇవ్వాలని కోరింది. డబ్బులు అవసరమై ఉద్యోగులు అధిక వడ్డీలకు రుణాలు తీసుకుని కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసింది. విశ్రాంత ఉద్యోగులకు వెంటనే చెల్లింపులు చేయాలని డిమాండ్ చేసింది. మరణించిన ఉపాధ్యాయుల వారసుల కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏ బకాయిలు, మినహాయింపులను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని పేర్కొంది. పాత సీపీఎస్ విధానాన్నే అమలు చేయడంతో పాటు 12వ పీఆర్సీ కమిషన్ ను సైతం నియమించాలని ఫెడరేషన్ ఆఫ్ ఏపీ టీచర్స్ ఆర్గనైజేషన్స్ సభ్యులు కోరారు.తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.