Nitish Kumar Reddy : గవాస్కర్ కాళ్ళు మొక్కిన నితీష్ కుమార్ రెడ్డి తండ్రి

by Y. Venkata Narasimha Reddy |
Nitish Kumar Reddy : గవాస్కర్ కాళ్ళు మొక్కిన నితీష్ కుమార్ రెడ్డి తండ్రి
X

దిశ, వెబ్ డెస్క్ : అస్ట్రేలియా ఇండియా జట్ల(Australia vs India) మధ్య మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న నాల్గవ టెస్టు(4th Test)లో కష్టాల్లో ఉన్న జట్టును తన అధ్భుత సెంచరీతో ఆదుకున్న తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy)పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. సెంచరీతో అదరగొట్టిన నితీష్ కుమార్ పై దిగ్గజ మాజీ క్రికెటర్ గవాస్కర్(Gavaskar)ప్రశంసల వర్షం కురిపించడంతో పాటు స్టాండింగ్ ఓషన్ తో అభినందించారు. మ్యాచ్ బ్రేక్ సమయంలో నితీశ్ కుమార్ తండ్రి ముత్యాల్ రెడ్డి కామెంట్రీ బాక్స్ లోని సునీల్ గవాస్కర్‌ను కలిసి ఆయన కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. వెంటనే సన్నీ ఆయనను పైకి లేపి ఆలింగనం చేసుకున్నారు.

అటు నితీష్ కుమార్ రెడ్డి తన అభిమాన క్రికెటర్ విరాట్ కోహ్లిని ప్రత్యేకంగా కలిసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి ఫోటో దిగారు. ఏ మాత్రం అంతర్జాతీయ అనుభవం లేకున్నా అసీస్ సీనియర్ బౌలర్లను ఎదుర్కోని సెంచరీతో ఇండియా జట్టును మ్యాచ్ లో మళ్లీ పోటీలోకి తెచ్చిన నితీష్ రెడ్డిని దిగ్గజ ఆటగాళ్లు అంతా అభినందనలతో ముంచెత్తుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed