CM Revanth Reddy : చర్లపల్లి టెర్మినల్ కు ఆయన పేరు పెట్టాలని కేంద్రమంత్రికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ

by M.Rajitha |
CM Revanth Reddy : చర్లపల్లి టెర్మినల్ కు ఆయన పేరు పెట్టాలని కేంద్రమంత్రికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnav) కు లేఖ రాశారు. తెలంగాణలో ఇటీవల కొత్తగా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్(Charlapalli Railway Terminal Station) పేరును పొట్టి శ్రీరాములు చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్” గా మార్చాలని కోరుతూ కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కు లేఖ రాశారు. తెలంగాణ మరింత అభివృద్ధి చెందే విధంగా రాష్ట్రానికి కొత్త టెర్మినల్ ను చర్లపల్లిలో ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాను అని లేఖలో పేర్కొన్నారు. అలాగే తెలుగు ప్రజల ఆత్మగౌరవం, గొప్ప మనిషి అమరజీవి పొట్టిశ్రీరాములు(Amarajivi Potti Sriramulu) పేరును కొత్త టెర్మినల్ కు పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని తెలిపారు.

అయితే హైదరాబాద్ లోని తెలుగు యూనివర్సిటీకి ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు పేరును మార్చి, సురవరం ప్రతాపరెడ్డి(Suravaram Prathapa Reddy) తెలుగు యూనివర్సిటీగా మార్చిన విషయం తెలిసిందే. గత వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్రతిపాదనను అసెంబ్లీలో చర్చకు తెచ్చి, ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో తెలుగు యూనివర్సిటీ పేరును మారుస్తూ బిల్లుకు ఆమోదముద్ర వేసింది రేవంత్ సర్కార్. అయితే తెలుగు రాష్ట్రం కోసం తన ప్రాణాలను వదిలేసిన పొట్టి శ్రీరాములుకు ప్రత్యేక గౌరవం ఇవ్వాలని నిర్ణయించి, తెలంగాణలో కొత్తగా నిర్మించిన రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్రానికి లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి.



Next Story

Most Viewed