- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
IPL 2025 : ఐపీఎల్ క్రేజ్ అంటే అలా ఉంటుంది మరి.. పాక్ లీగ్‌లో కాంట్రాక్ట్ బ్రేక్ చేసిన సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరల్డ్ టాప్ క్రికెటర్లు కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడేందుకు ఇష్టపడతారు. జాతీయ జట్టు కంటే ఐపీఎల్‌కే ప్రాధాన్యం ఇచ్చే ఆటగాళ్లు కూడా ఉన్నారు. డబ్బు, క్రేజ్ ఇతర విషయాలు అందుకు కారణంగా చెప్పుకోవచ్చు. తాజాగా సౌతాఫ్రికా క్రికెటర్ కార్బిన్ బోష్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌లో ఆడేందుకు పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) నుంచి తప్పుకున్నాడు. జనవరిలో జరిగిన ఆటగాళ్ల డ్రాఫ్ట్‌లో బోష్ షెషావర్ జల్మీ జట్టుకు ఎంపికయ్యాడు.
అయితే, ముంబై ఇండియన్స్ ప్లేయర్, సౌతాఫ్రికాకే చెందిన లిజార్డ్ విలియమ్స్ గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ముంబై అతని స్థానంలో కార్బిన్ బోష్‌ను తీసుకుంది. ముంబై నుంచి ఆఫర్ రావడంతో బోష్ పీఎస్‌ఎల్ నుంచి వైదొలిగాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నిర్ణయమే పీఎస్‌ఎల్‌కు శాపంగా మారింది. సాధారణంగా పీఎస్‌ఎల్ ఫిబ్రవరి-మార్చిలో జరుగుతుంటుంది. కానీ, అంతర్జాతీయ మ్యాచ్‌లు, చాంపియన్స్ ట్రోఫీ కారణంగా పీసీబీ ఐపీఎల్‌కు పోటీగా పీఎస్‌ఎల్ షెడ్యూల్‌ను రూపొందించింది. ఈ రెండు టోర్నీలు ఒకే సమయంలో జరుగుతుండటంతో క్రికెటర్లు గందరగోళంగా పడ్డారు. అయితే, వరల్డ్ క్రికెట్‌లోనే బిగ్గెస్ట్ లీగ్ అయిన ఐపీఎల్‌ను ఏ ఆటగాడు వదులుకోడు. బోష్ కూడా ఐపీఎల్‌కే మొగ్గుచూపాడు. పాక్ లీగ్‌తో కాంట్రాక్ట్ బ్రేక్ చేసుకోవడంతో ఆగ్రహంగా ఉన్న పీసీబీ బోష్‌కు నోటీసులు జారీ చేసింది. పీఎస్‌ఎల్ నుంచి తప్పుకోవడానికి గల ప్రొఫెషనల్ కారణాలెంటో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది.
- Tags
- IPL 2025