- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
IPL 2025 : చెన్నయ్, ముంబైలకు టైటిల్ గెలిచే సత్తా ఉందా?

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ జట్ల అంటే టక్కున గుర్తొచ్చే జట్లు రెండు. ఒకటి చెన్నయ్ సూపర్ కింగ్స్.. మరో జట్టు ముంబై ఇండియన్స్. ఇరు జట్లు చెరో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచాయి. టోర్నీ చరిత్రలో అత్యధికసార్లు విజేతగా నిలిచిన జట్లుగా కొనసాగుతున్నాయి. లీగ్ స్టార్ట్ అవుతుందంటే టైటిల్ ముంబై గెలుస్తుందా?లేదంటే చెన్నయ్ సాధిస్తుందా? అనే చర్చే జరుగుతుంది. లీగ్‌పై ఈ రెండు జట్ల ప్రభావం అంతలా ఉంది. ప్రతి సీజన్‌లోనూ ఈ జట్లపై భారీ అంచనాలు ఉంటాయి. మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్-2025 మొదలుకానుంది. ఈ సారి కూడా ముంబై, సీఎస్కే ఫేవరెట్స్‌గా బరిలోకి దిగుతున్నాయి. ఈ నెల 23న ఇరు జట్లు తమ ఓపెనింగ్ మ్యాచ్‌లో ఎదురుపడనున్నాయి. మరి, చెన్నయ్, ముంబై బలాబలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం..
అనుభవజ్ఞులు, యువకులతో చెన్నయ్
ధోనీ నాయకత్వంలో చెన్నయ్ ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచింది. గత సీజన్‌కు ముందు ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ 2024లో జట్టును నడిపించాడు. అయితే, జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చడంలో విఫలమయ్యాడు. గత సీజన్ అనుభవంతో గైక్వాడ్ ఈ సారి జట్టును మెరుగ్గా నడిపించొచ్చు. అనుభవజ్ఞులు, యువకులతో సీఎస్కే సమతూకంగా కనిపిస్తుంది. గైక్వాడ్, కాన్వే జట్టుకు ప్రధాన బలంగా ఉన్నారు. 2023లో టైటిల్ గెలవడంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారు. గత ఏడాది గైక్వాడ్ 583 రన్స్‌తో సెకండ్ హయ్యెస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. గాయం కారణంగా గత సీజన్‌కు దూరమైన కాన్వే ఈ సారి అందుబాటులోకి వచ్చాడు. రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, శివమ్ దూబెలతో బ్యాటింగ్ దళంగా పటిష్టంగా ఉండగా.. జడేజా, సామ్ కర్రన్, రవిచంద్రన్ అశ్విన్ వంటి ఆల్‌రౌండర్ల బలం ఉంది. ఎం.ఎస్ ధోనీ ఫినిషర్‌గా తన పాత్రను పోషించడానికి సిద్థంగా ఉన్నాడు. అలాగే, జట్టు ఎంపిక నుంచి మైదానంలో వ్యూహాల వరకు గైక్వాడ్‌ను వెనుకుండి నడిపిస్తాడు. ధోనీకి ఇదే చివరి సీజన్ అన్న వార్తల నేపథ్యంలో అందరి దృష్టి అతనిపైనే ఉంది. ఇక, బౌలింగ్ విషయానికొస్తే వేలంలో సీఎస్కే సమూల మార్పులు చేసింది. శ్రీలంక బౌలర్ మతీశా పతిరణను మాత్రమే రిటైన్ చేసుకుంది. ఈ సారి బౌలింగ్‌లో అతను కీలకం కానున్నాడు. ధోనీ మార్గదర్శకత్వంలో రాటుదేలిన పతిరణ గత సీజన్‌లో 6 మ్యాచ్‌ల్లోనే 13 వికెట్లు పడగొట్టాడు. అతనికితోడు నాథన్ ఎల్లీస్, జేమీ ఓవర్టన్, సామ్ కర్రన్ పేస్ దళాన్ని మోయనుండగా.. నూర్ అహ్మద్, జడేజా, అశ్విన్ స్పిన్ బాధ్యతలు పంచుకుంటారు.
గ్రూపులుగా విడిపోయి
ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఎప్పుడూ ప్రమాదకరమే. అయితే, గత సీజన్‌లో ఆ జట్టు పేలవ ప్రదర్శన చేసింది. 10వ స్థానంలో నిలిచింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ముంబైకి ఐదు టైటిల్స్ అందించిన రోహిత్ శర్మను యాజమాన్యం గతేడాది కెప్టెన్సీ నుంచి తప్పించడం అందరినీ షాక్ గురి చేసింది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. రోహిత్‌ను తప్పించడం ముంబై ఫ్యాన్స్‌కు తట్టుకోలేకపోయారు. గత సీజన్‌లో సొంత అభిమానుల నుంచే ముంబై విమర్శలు ఎదుర్కొంది. పాండ్యా దారుణంగా ట్రోలింగ్ గురయ్యాడు. మరోవైపు, ముంబై జట్టు కూడా రెండు గ్రూపులు విడిపోయినట్టు వార్తలు వచ్చాయి. రోహిత్‌కు అనుకూలంగా కొందరు. మరికొందరు పాండ్యాకు మద్దతు ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. దీంతో డ్రెస్సింగ్ రూంలో సఖ్యత కరువైనట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. మొత్తంగా గత సీజన్‌లో ముంబై పేలవ ప్రదర్శనను మూటగట్టుకుంది. ఈ సీజన్‌లో పాండ్యా నాయకత్వంలో ముంబై ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. రోహిత్, సూర్యకుమార్, బుమ్రా, పాండ్యా ముంబైకి ప్రధాన బలం. విల్ జాక్స్, తిలక్ వర్మ, ట్రెంట్ బౌల్ట్, మిచెల్ సాంట్నర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ అదనపు బలం కానున్నారు. అయితే, ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడిన బుమ్రా ఇంకా ఫిట్‌నెస్ సాధించలేదు. కొన్ని గ్రూపు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. అలాగే, ఫినిషర్ రూల్ పోషించడానికి పాండ్యా మినహా మరో ఆటగాడు లేకపోవడం లోటు.
ఆరో టైటిల్ ఎవరిదో?
ప్రస్తుతం చెన్నయ్, ముంబై చెరో ఐదుసార్లు టైటిల్స్ సాధించాయి. సీఎస్కే 2011, 2012,2018, 2021, 2023 సీజన్లలో విజేతగా నిలిచింది.2013, 2015, 2018, 2019, 2021లో కప్పు ఎగురేసుకపోయింది. ఇతర జట్లు దరిదాపుల్లో కూడా లేవు. కోల్‌కతా మాత్రమే మూడు టైటిల్స్ గెలిచింది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లలో ఏ జట్టు టైటిల్ గెలిచినా కొత్త రికార్డు సృష్టించనుంది. ఆరో టైటిల్‌తో లీగ్ చరిత్రలో అత్యధిక టైటిల్ సాధించిన జట్టుగా ఘనత సాధిస్తుంది.