- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
దిశ, కామారెడ్డి టౌన్ : మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కార్మిక సంఘం (సిఐటియు)ఆధ్వర్యంలో శనివారం మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాజనర్సు మాట్లాడుతూ..మున్సిపల్ కార్మికుల పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలని, ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటి పెండింగ్ డబ్బులు కార్మికుల అకౌంట్లో జమ చేయాలన్నారు. మున్సిపల్ కార్మికులకు కేటగిరి వారిగా జీవో నెం 60 ప్రకారం పెరిగిన జీతాలు ఇవ్వాలని తదితర డిమాండ్లపై వినితిపత్రం అందజేశామన్నారు. సమస్యలు పరిష్కారం కాకపోతే రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జనవరి 4,5 తేదీలలో మున్సిపల్ కార్యాలయం ముందు దీక్షలు నిర్వహిస్తామన్నారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకుంటే 6వ తేదీన కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం ఉంటుందన్నారు. జనవరి 27 తర్వాత సమ్మెబాట నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మహబూబ్, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రభాకర్, కాట్రియాల ప్రభు, దీపక్, శివరాజవ్వ, గంగాధర్, జ్యోతి, రవి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.