- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ద్విచక్ర వాహనదారుడిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి
by Naveena |
X
దిశ, ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఉపసర్పంచ్ సింగన బోయిన ఐలయ్య( 50 ) వృత్తిరీత్యా ఎల్ఐసి ఏజెంట్ గా పని చేస్తున్నారు. ధర్మసాగర్ లో పని నిమిత్తం వెళ్లి ఎల్కతుర్తి కి తిరిగి వస్తుండగా అటువైపు నుంచి వస్తున్న TS 03 FG 2780 అనే కారుకు సైడ్ ఇవ్వనందున వారు వెంబడించారు. దామెర గ్రామ శివారులో శనివారం సాయంత్రం దాడి చేయడమే కాకుండా చరవాణి, ద్విచక్ర వాహనం,రెండు తులాల బంగారు దొంగిలించుకొని వెళ్ళిపోయారని పేర్కొన్నారు. అనంతరం బాధితుడు ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దాడి జరిగిన స్థలం వద్దకు సర్కిల్ ఇన్స్పెక్టర్ పులి రమేష్, ఇంచార్జ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సతీష్ వచ్చి విచారణ చేశారని బాధితుడు విలేకరులకు వివరించారు. దాడి చేసిన వారు ధర్మసాగర్ మండలానికి చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
Advertisement
Next Story