చేపల వేటకు వెళ్లి చెరువులో పడి వ్యక్తి మృతి

by Kalyani |
చేపల వేటకు వెళ్లి చెరువులో  పడి వ్యక్తి మృతి
X

దిశ కొండపాక: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లోని అంకిరెడ్డిపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. సిద్ధిపేట త్రీ టౌన్ సీఐ విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని అంకిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన పోకల నర్సింలు(43) గ్రామం లోని ఊర చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి ఎంతకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో వెతుకుతుండగా గ్రామంలోని చెరువులో పడి మృతి చెందినట్లు గమనించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed