- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో కిడ్నాప్‌లు, హత్యలు మామూలు అయిపోయాయి : రేణుకా చౌదరి
దిశ, తెలంగాణ బ్యూరో: ల్యాండ్ డీల్స్‌కు తెలంగాణ అడ్డాగా మారిందని, దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆమె గురువారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ధరణి పోర్టల్ సృష్టించిన ఇబ్బందుల వల్ల రైతులు నష్టపోతున్నారని, వేల మంది రైతులు తన దగ్గరకు వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నారని, ఎప్పుడో అమ్మిన భూముల యాజమాన్య హక్కులు మారడం లేదని, దీంతో రియల్ ఎస్టేట్ మాఫియా రైతుల పై దౌర్జన్యం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ స్టార్టప్ అంటే ఇదేనా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టెక్నాలజీ మంచిదే కానీ అదే టెక్నాలజీ ఎన్నో ఇబ్బందులు సృష్టిస్తుందని, ఇలా అయితే అందరూ కిడ్నాప్‌లు, మర్డర్‌లు చేస్తారని అన్నారు.
రాష్ట్రంలో రక్షణ కరువైందని, కిడ్నాప్‌లు, హత్యలు మామూలు అయిపోయాయని రాష్ట్ర ప్రభుత్వం పై మండిపడ్డారు. అమరావతిలో న్యాయం గెలిచిందన్నారు. రైతుల పోరాటంతోనే ఇది సాధ్యమైందన్నారు. మహిళలు సైతం ఈ పోరాటంలో గట్టి పోరాట పటిమ చూపించారని, రైతుల పాదయాత్రతో దేవుడు కరుణించాడని అన్నారు. తిరుమల వెంకన్న, కనకదుర్గ ఆశీస్సులు అమరావతి రైతులకు ఉన్నాయని, అమరావతి పై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. రైతుల పోరాటానికి కోర్టు తీర్పుతో సరైన న్యాయం జరిగిందన్నారు. ప్రభుత్వం ఈ తీర్పుపై అప్పీల్ కు వెళితే.. రైతుల తరఫున మేము కూడా అప్పీల్ కు వెళతామని తెలిపారు.