పోలీస్ సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సభ్యురాలు..

by Aamani |
పోలీస్ సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సభ్యురాలు..
X

దిశ, ములుగు ప్రతినిధి: బుధవారం ప్రభుత్వం నిషేదిత సీపీఐ మావోయిస్టు పార్టీ నేషనల్ పార్క్ ఏరియా కమిటీ కి చెందిన సభ్యురాలు అలువ స్వర్ణ @ స్వర్ణక్క ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఎదుట లొంగి పోయింది. ఒడిశా రాష్ట్రం పొట్టేరు గ్రామనికి చెందిన అలువ స్వర్ణ @ స్వర్ణక్క 2000 సం. లో కలిమెల ఏరియా కమిటీ కి చెందిన కమాండర్ రామన్న ప్రోత్సాహంతో నిషేదిత సీపీఐ మావోయిస్టు పార్టీ లో సభ్యురాలి గా చేరింది అని,అప్పట్లో నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు అయిన ఛట్టిరాజా పాపయ్య @ సోమన్న ప్రొటెక్షన్ టీమ్ లో చేరి 3 సం. లు పార్టీ సభ్యురాలి గా పని చేసింది అని అన్నారు.

ఆ తర్వాత గినుగు నరసింహారెడ్డి @ జంపన్న ప్రొటెక్షన్ టీమ్ చేరి 5 సం. లు పార్టీ సభ్యురాలి గా పనిచేసింది అన్నారు. ఈ క్రమంలో సీపీఐ మావోయిస్టు పార్టీ లో పని చేసే సమయంలో 2005 సం. జనవరి 16 న కర్ణ గండి @ రాంపూర్ అటవీ ప్రాంత ఎదురు కాల్పుల ఘటనలో పాల్గొంది అని,ఈ ఘటనలో నల్ల వసంత్ @ జగన్ తాళ్ల సుదర్శన్ @ గంగన్న అనే ఇద్దరు మావోయిస్టులు మృతిచెందగా, స్వర్ణక్క,మరి కొంత మంది పార్టీ సభ్యులు తప్పించుకొని పారిపోవడం జరిగింది అని, అదే సంవత్సరం నవంబర్ 5 న లింగాల గుట్ట @ పాలధార గుట్ట ఎదురుకాల్పుల ఘటనలో కూడా పాల్గొన్నది అని, ఈ ఘటనలో బట్టు ఎలిశా @ మమతా మరణించగా, స్వర్ణక్క, మరి కొంత మంది పార్టీ సభ్యులు తప్పించుకొని పారిపోవడం జరిగింద అని తెలిపారు. 2006 లో అప్పటి నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ లో సోమన్న ప్రొటెక్షన్ టీమ్ కమాండర్ అయిన కురసం సాయన్న @ జగత్ వ్యక్తి ని వివాహం చేసుకుంది అని, 2008 సం. లో ఏరియా కమిటీ సభ్యురావి గా పదోన్నతి పొందింది. అప్పటి కేంద్ర కమిటీ సభ్యులు అయిన యాప నారాయణ @ హరి భూషణ్ మరియు రావుల శ్రీనివాస్ @ రామన్న లకు ప్రొటెక్షన్ గా పని చేసింది అని,2015 సం. లో వెస్ట్ బస్తర్ కి బదిలీ పై వెళ్లి నేషనల్ పార్క్ ఏరియా కమిటీ లో ఏరియా కమిటీ సభ్యురాలిగా చేరి సండ్ర ఎల్ ఓ ఎస్ కమాండర్ గా 2 సం. లు పనిచేసింది అని అన్నారు.

2017 సం. లో నేషనల్ పార్క్ ఏరియా కమిటీ కార్యదర్శిగా ఉన్న తన భర్త కురసం సాయన్న @ జగత్ గుండం ఎదురుకాల్పుల్లో మృతిచెందగా, స్వర్ణక్క మానసికంగా కుంగిపోయి, ఆరోగ్యం క్షీణించి ఆ తరువాత, సండ్ర ఎల్ ఓ ఎస్ కమాండర్ పదవి నుంచి నేషనల్ పార్క్ ఏరియా కమిటీ జనతన సర్కార్ అధ్యక్షురాలిగా 2 సం.లు వ్యవహరించింది అన్నారు. 2019 సం. నుండి ఇప్పటి వరకు కృషి విభాగం (వ్యవసాయం) అధ్యక్షురాలిగా కొనసాగుతుంది అని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం నిషేదిత సీపీఐ మావోయిస్టు పార్టీ భవిష్యత్తు లో మనుగడ సాగించే అవకాశం లేదని, మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు అర్ధ రహితమని తెలుసుకొని కుటుంబంతో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకొని ములుగు జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోవడం జరిగింది అని జిల్లా ఎస్పీ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు డీఎస్పీ రవీందర్, ఇంచార్జ్ ఓ ఎస్ డి శ్రీనివాస్, అసిస్టెంట్ కమాండెంట్-39 బి ఎన్ సి ఆర్ పి ఎఫ్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed