- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ ప్రభుత్వం సెక్యులర్ ప్రభుత్వం
దిశ,నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రాల్లో పలు చర్చిలలో క్రిస్టమస్ వేడుకల ఘనంగా జరిగాయి. క్రిస్టమస్ వేడుకలలో ఆర్ అండ్ బి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని, క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు.అలాగే ప్రపంచం మొత్తంలో ఎక్కువ మంది జరుపుకునే పండుగ క్రిస్టమస్ పండుగ అని అన్నారు. నిరుపేదలకు అండగా ఉంటూ సహాయం చేయాలని తెలిపారు. లేప్రసి వారికి చాలా మంది క్రైస్తవులు సేవ చేశారు. పొరుగు వారిని ప్రేమించే నినాదం పాటిస్తే యుద్దాలు ఉండవు అని సూచించారు. బైబిల్ చదువుతే అందరూ మారిపోతారని, ఉచితంగా ప్రజలందరికీ జిల్లాలో వైద్య సేవలు అందేలా చేస్తానని తెలిపారు. ఈ ప్రభుత్వం సెక్యులర్ ప్రభుత్వం అని, అన్ని కులాలను, మతాలను విలువిచ్చే ప్రభుత్వం అని అన్నారు. నల్లగొండ పట్టణాన్ని అందమైన నగరంగా తీర్చి దిద్దుతామని తెలిపారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ..అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి లో బెంగుళూరు, ఢీల్లి లో దొరికే వైద్య సేవలు నల్లగొండలో అందించే దిశ మంత్రి కృషి చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాలలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మార్వో శ్రీనివాస్ కౌన్సిలర్ల పాస్టర్లు పాల్గొన్నారు.