- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేడారం జాతర విజయవంతంలో అందరూ భాగస్వామ్యం కావాలి : మంత్రి సీతక్క
దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో 2025 సంవత్సరంలో జరగబోయే మినీ మేడారం జాతర దృశ్య సమ్మక్క సారలమ్మ పూజరులతో మంత్రి సీతక్క సమావేశం అయ్యారు. మేడారం ఆలయానికి వెళ్లే క్యూ లైన్లు పై షెడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మేడారంలో రాబోయే పెద్ద జాతరను దృష్టిలో పెట్టుకొని ప్రతిపాదనలు సిద్ధం చేయాలి అని, శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర గొప్పతనాన్ని కాపాడుకోవాలి అని, మేడారం ప్రజలు పరిసరాల చుట్టూ చెట్లను నాటాలి అని, మేడారం జాతర విజయవంతం లో పూజారులు,ప్రజలు భాగస్వామ్యం కావాలి అని పిలుపునిచ్చారు.
మేడారం వచ్చిపోయే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అని, 2.80 లక్షలతో వీవీఐపీ దారిని శంకుస్థాపన చేయడం జరిగింది అని, క్యూ లైన్ పై షెడ్డుల నిర్మాణం కోసం రూ.3 కోట్ల 8 లక్షల రూపాయల తో నిర్మాణం చేయనున్నట్టు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పని చేస్తున్నాం అని, జంపన్న వాగు నుంచి జాతర గద్దెల వరకు రోడ్డు వెడల్పు చేసి సెంటర్ లైట్ ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వీరవనితలు సమ్మక్క సారలమ్మ లకు 800 యేండ్ల నాటి చరిత్ర ఉంది అని, చరిత్ర కలిగిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు యూనేస్కో గుర్తింపు రావాల్సిన అవసరం ఉంది అని అన్నారు.