- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
రైతుల ఖాతాల్లో డబ్బులు జమ..ఎందుకో తెలుసా..?
దిశ ,భిక్కనూరు : రేషన్ కార్డుల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఎంతోమంది నిరుపేదలు, నిలువ నీడ లేక పూరి గుడిసెలు, రేకుల షెడ్లలో జీవనం సాగిస్తున్న వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు సంక్షేమ పథకాలు ఒకే రోజు అమలు కావడం ఎంతోమంది పేదల్లో ఎనలేని సంతోషాన్ని నింపినట్లు చేసింది. ఆరోగ్యశ్రీ తో పాటు, సంక్షేమ పథకాలలో లబ్ధి పొందాలంటే రేషన్ కార్డె ప్రామాణికం కావడంతో..ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డులు నిన్నటి రోజు పేదల చేతులకు అందడంతో ఎంతోమంది నిరుపేదలు ఉబ్బి తబ్బిబ్బయ్యారు. కలా... నిజమా..? అన్నట్లుగా వారంతట వారే ఆశ్చర్యపోయే విధంగా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డులు అందుకోవడంతో, పంపిణీ చేసిన వారికి వంగి వంగి దండాలు పెట్టి, తీసుకున్న ధ్రువపత్రాలను గుండెకు హత్తుకున్న సంతోషం సదరు పేదల్లో కనిపించింది. జాబితాలో పేర్లు రానివారు కొంతమంది బాగా నారాజ్ అయినప్పటికీ, పైలెట్ గ్రామాల కింద ఎంపికైన గ్రామాల్లో నిన్న నిన్నటి జరిగిన కార్యక్రమాలకు ఉత్సాహంగా హాజరు కావడం, ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు, అర్హులైన ఏ ఒక్కరికి మిస్ కాకుండా లబ్ధి చేకూర్చడం జరుగుతుందని, ముఖ్యంగా పైరవీలకు ఆస్కారం లేకుండా, అర్హత ఉంటే చాలు వారు కూర్చున్న చోటికే పథకాలు వస్తాయని, దీంట్లో ఎంత మాత్రం అనుమానాలు అక్కరలేదని కుండబద్దలు కొట్టినట్లు క్లారిటీ ఇవ్వడంతో..వారిలో కూడా ఆశలు చిగురించాయి.
కామారెడ్డి జిల్లాలో 535 గ్రామ సభలు, 80 వార్డు సభలు ప్రభుత్వం నిర్వహించగా.. కొత్తగా రేషన్ కార్డుల కోసం 54 వేల 534 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం 28 వేల 653 మంది దరఖాస్తు చేసుకున్నారు. రైతు భరోసా పథకం కింద 2653 మంది రైతులు దరఖాస్తు చేసుకోగా.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద18,098 పేదలు జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఒక్కో గ్రామాన్ని పైలట్ గ్రామంగా ఎంపిక చేసి సంక్షేమ పథకాలను ఆర్భాటంగా ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం ముందు చెప్పినట్లుగానే పైలెట్ గ్రామాలుగా ఎంపిక చేసిన రైతుల ఖాతాల్లో భరోసా డబ్బులు జమ అయ్యాయి. ఖాతాల్లో డబ్బులు జమ కాలేవని ఉదయం నుంచి టెన్షన్ పడ్డ రైతులకు, సాయంత్రం కాగానే వారి వారి ఖాతాల్లో డబ్బులు జమ కావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2653 మంది రైతులు దరఖాస్తు చేసుకోగా.. పైలెట్ గ్రామాల కింద ఎంపిక చేసిన రైతులకు మాత్రమే రైతు భరోసా డబ్బులు వారి ఖాతాల్లో జమయ్యాయి. తర్వాత అన్ని గ్రామాల రైతులకు క్రమంగా రైతు భరోసా అందనుందని అధికార యంత్రాంగం చెబుతోంది.
తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కంట్రోల్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఉమ్మడి జిల్లాల ప్రత్యేక అధికారి డాక్టర్ ఏ శరత్ భిక్కనూరు మండలం ర్యాగట్ల పల్లి గ్రామంలో జరిగిన, సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమ పథకాలు అందాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అన్న విషయాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు.