Delhi: నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు..

by Ramesh Goud |   ( Updated:2025-02-02 04:22:48.0  )
Delhi: నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు..
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly elections) నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల (Telugu states) సీఎంలు (CMs) హస్తిన బాట పట్టనున్నారు. మరో మూడు రోజుల్లో (Next Three days) ఢిల్లీలో ఎన్నికలు ఉండటంతో హడావిడి (full swing) జోరుగా కొనసాగుతోంది. ఢిల్లీ పీటం దక్కించుకోవడానికి ప్రధాన పార్టీల నేతలు కుస్తీలు పడుతున్నారు. మరోసారి ఢిల్లీ గద్దెనెక్కాలని ఆప్ (AAP) ప్రయత్నిస్తుండగా.. ఎలాగైనా ఢిల్లీ చేజిక్కుంచుకోవాలనే లక్ష్య్ంగా బీజేపీ (BJP) కృషి చేస్తోంది. ఇక కాంగ్రెస్ (Congress) ఢిల్లీలో జెండా ఎగుర వేయాలని తెగ ఆరాట పడుతోంది. ఈ పార్టీలు తమ అభ్యర్థులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి నేతలను పిలిపించుకొని మరీ ప్రచారాలు సాగిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ప్రచారం కోసం ఏపీ (AP), తెలంగాణ (Telangana) సీఎంలు సైతం వెళ్లనున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chnadrababu), తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. నేడు, రేపు ఢిల్లీలో తమ పార్టీల కోసం ప్రచారం సాగించనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు ఈ రోజు మధ్యాహ్నం 2.30 కి హైదరాబాద్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad airport) నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకోనున్నారు. ఎన్డీఏ కూటమి (NDA Alliance)లో భాగంగా బీజేపీ తరుపున సాయంత్రం 7 గంటలకు చంద్రబాబు ప్రచారంలో పాల్గొననున్నారు.

ఏపీలో అమలు అవుతున్న పథకాలు.. తదితర అంశాలపై ఢిల్లీ ప్రజలకు వివరించనున్నారు. అంతేగాక ఢిల్లీలో బీజేపీని గెలిపించి, డబుల్ ఇంజిన్ సర్కార్ ను నెలకొల్పాలని ఢిల్లీ ప్రజలను కోరనున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ నేతల తరుపున ప్రచారం నిర్వహించనున్నారు. ప్రచారంలో భాగంగా నేడు, రేపు రేవంత్ ఢిల్లీలో పర్యటించనున్నారు. అనంతరం ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలిసి బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి వివరించనున్నారని తెలుస్తోంది. కాగా ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 5న జరగనున్నాయి.


Next Story

Most Viewed