- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కుంభమేళా తొక్కిసలాట దురదృష్టకరం

- భక్తుల రక్షణే మా తొలి ప్రాధాన్యత
- ఆ రోజు అక్కడ 10 కోట్ల మంది భక్తులున్నారు
- యూపీ సీఎం యోగీ ఆధిత్యానాథ్
దిశ, నేషనల్ బ్యూరో: మహ కుంభమేళాలో భాగంగా మౌని అమావాస్య రోజు త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరించడానికి వచ్చిన భక్తులు తొక్కిసలాటలో మృతి చెందడం చాలా దురదృష్టకరమని యూపీ సీఎం యోగీ ఆధిత్యానాథ్ అన్నారు. అయితే తొక్కిసలాట తర్వాత ఆ ప్రదేశంలో ఉన్న 8 కోట్ల మంది భక్తుల రక్షణే మాకు తొలి ప్రాధాన్యతగా ఉంది. అందుకే అప్పుడు తొక్కిసలాటపై స్పందించలేదని యోగీ చెప్పారు. జనవరి 29 తెల్లవారుజామున 1.15 - 1.30 మధ్య ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగినప్పుడు కుంభమేళా ప్రాంతంలో నాలుగు కోట్ల మంది భక్తులు ఉన్నారు. ఉదయం 4 గంటలకు అమృత్ స్నాన్ ముహూర్తం ఉంది. దీంతో ఒక్క సారిగా భారీగా భక్తులు అక్కడకు తరలివచ్చారు. మౌని అమావాస్య రోజు స్నానాలు చేయడానికి 8 కోట్ల మంది అక్కడకు చేరుకున్నారు. వీరికి తోడు జౌన్‌పూర్, బదోహి, మీర్జాపూర్, ప్రతాప్‌గఢ్, రాయ్ బరేలీ, కౌశంబి, ఫతేపూర్, చిత్రకోట్ ప్రాంతాల్లో రెండు కోట్ల మందిని మేం నిలిపివేశాం. తొక్కిసలాట జరిగిన వెంటనే ఎక్కడికక్కడ భక్తుల ప్రయాగ్‌రాజ్ రాకుండా ఆపేశాం. కానీ అప్పటికే ప్రయాగ్‌రాజ్ చుట్టుపక్కల కలిపి 10 కోట్ల మంది భక్తులు ఉన్నారని యోగీ ఆధిత్యా నాథ్ చెప్పారు.
ఇతర ప్రాంతాల్లో నిలిపి వేసిన 2 కోట్ల మంది కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. భక్తుల రవాణాతో పాటు వారి కోసం అన్నదాన కేంద్రాలు కూడా ఏర్పాటు చేశామని యోగీ చెప్పారు. ఘటన జరిగిన వెంటనే గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి గాయపడిన వారిని ఆసుపత్రులకు 15 నిమిషాల్లో తరలించాము. 65 మంది తీవ్రంగా గాయపడగా.. వారందరినీ ఆసుపత్రులకు పంపించాం. కానీ అందులో 30 మంది చనిపోయారు. ఆ తర్వాత వారి మృతదేహాలను కుటుంబాలు అప్పగించామని ఆధిత్యానాథ్ చెప్పారు. అయితే ఇది దురదృష్టకరమైన సంఘటన, దీనిపై విచారణ వ్యక్తం చేస్తున్నాను. కానీ ఆ సమయంలో మిగిలిన 8 కోట్ల మంది భక్తుల భద్రత మాకు తొలి ప్రాధాన్యతగా ఉందని యోగీ చెప్పారు. తొక్కిసలాట జరగగానే అఖాడాలను స్నానం చేయడానికి ఆగాలని కోరాము. ముందుగా భక్తులకు అవకాశం ఇవ్వాలని చెప్పాము. వారు మా మాటను అంగీకరించి.. మధ్యాహ్నం 12 తర్వాత అఖాడాలు స్నానం చేశారని యోగీ వివరించారు.