- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దేవరగుట్ట ను వీడిన చిరుత..

దిశ, నవాబుపేట: మండల పరిధిలోని యన్మన్ గండ్ల గ్రామ సమీపంలోని దేవర గుట్టలో గత కొంతకాలంగా ఆవాసం ఉండి ఆ ప్రాంత ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన చిరుత, ఆదివారం రాత్రి ఆ గుట్టను వీడి సుమారు కిలోమీటరు దూరంలో వాసర్ ఖాన్ దర్గా చుట్టు ప్రక్కల సంచరించి దర్గా సమీపంలోని చంద్ర గుట్ట లోకి ప్రవేశించింది. సోమవారం అటవీ శాఖ అధికారులు ఈ మేరకు పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. చంద్ర గుట్ట లోకి వచ్చి చిరుత చేరడంతో గుట్ట చుట్టూ గల కూచూరు, రుక్కంపల్లి, హన్మ సానిపల్లి, తూక్య తండా, సీతమ్మ తండాల ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. చిరుత చంద్ర గుట్టలోకి ప్రవేశించిందని, అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆ ప్రాంతం గుండా ప్రయాణాలు జాగ్రత్తగా చేయాలని అటవీ శాఖ అధికారులు తెలిపారు. గుట్ట చుట్టు ప్రక్కల ప్రాంతాలలో గల వ్యవసాయ పొలాల్లో ఎట్టి పరిస్థితులలోను కరెంట్ షాక్ పెట్టకూడదని, ఒకవేళ కరెంట్ షాక్ పెడితే చిరుత ప్రమాదంలో చిక్కుకుంటుందని వారు తెలిపారు. సోమవారం కూచూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి ఈ మేరకు వాట్సప్ గ్రూపులలో చిరుత సంచారం గురించి తెలియజేస్తూ పోస్ట్ లు పెట్టారు.