ప్రాణం కాపాడేందుకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు.. మెట్రో, ట్రాఫిక్ సిబ్బందిపై ప్రశంసలు

by Ramesh Goud |   ( Updated:2025-03-08 17:12:44.0  )
ప్రాణం కాపాడేందుకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు.. మెట్రో, ట్రాఫిక్ సిబ్బందిపై ప్రశంసలు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తిని కాపాడేందుకు హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) సహా ట్రాఫిక్ పోలీస్ అధికారులు (Traffic Police Officials) సహకరించారు. అవయవ మార్పిడిలో భాగంగా గుండెను వేగంగా తరలించేందుకు గ్రీన్ ఛానెల్ (Green Channel) ఓపెన్ చేశారు. జూబ్లీహిల్స్ (Jubilee Hills) లోని అపోలో హాస్పిటల్స్ (Appolo Hospitals) లో గుండె సంబంధిత వ్యాదితో బాధపడుతున్న ఓ వ్యక్తికి గుండె మార్పిడి ఆపరేషన్ (Heart Transplant Operation) చేయాలని ఆసుపత్రి వర్గాలు నిర్ణయించాయి.

ఎల్బీ నగర్ (LB Nagar) కామినేని హాస్పిటల్ (Kamineni Hospital) లో బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి గుండెను దానం చేసేందుకు అతడి కుటుంబసభ్యులు ముందుకు వచ్చారు. దీంతో దాత గుండెను ఎల్బీ నగర్ నుంచి జూబ్లీహిల్స్ కు వేగంగా తరలించేందుకు ఆసుపత్రి వర్గాలు హైదరాబాద్ మెట్రో, ట్రాఫిక్ అధికారుల సహకారం కోరారు. దీంతో మెట్రో అధికారులతో పాటు హైదరాబాద్ ట్రాఫిక్ సిబ్బంది గుండెను వేగంగా తరలించేందుకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసేందుకు సహకరించారు. ఎల్బీ నగర్‌లోని కామినేని హాస్పిటల్స్ నుండి జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్స్‌కు దాత హృదయాన్ని వేగంగా రవాణా చేసేలా నిర్ధారిస్తూ, ప్రాణాలను రక్షించే గుండె మార్పిడి కోసం గ్రీన్ ఛానెల్‌ని ఏర్పాటు చేశారు.

దీంతో వైద్యులు ఎల్బీ నగర్ నుంచి జూబ్లీ హిల్స్ వరకు కేవలం 25 నిమిషాల్లో, 18 స్టేషన్‌లలో (నాగోల్ మెట్రో స్టేషన్ నుండి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్ వరకు) 22 కి.మీలను కవర్ చేస్తూ గుండెను జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్ (Jubilee HIlls Check Post Metro Station) వరకు తరలించారు. అనంతరం అక్కడి నుంచి ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేసిన గ్రీన్ ఛానెల్ ద్వారా ఫిల్మ్ నగర్ (Film Nagar) లో ఉన్న అపోలో ఆసుపత్రికి అంబులెన్స్ ద్వారా దాత గుండెను నిర్ణీత సమయంలో చేర్చారు. దీంతో నిండు ప్రాణాన్ని రక్షించేందుకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసిన హైదరాబాద్ మెట్రో అధికారులతో పాటు, ట్రాఫిక్ సిబ్బంది పై ప్రశంసలు కురుస్తున్నాయి.

Next Story

Most Viewed