Anil Ravipudi: నా కెరియర్‌లో ఇది ఒక మిరాకిల్, ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నాను.. అనిల్ రావిపూడి ఎమోషనల్ కామెంట్స్

by Kavitha |
Anil Ravipudi: నా కెరియర్‌లో ఇది ఒక మిరాకిల్, ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నాను..  అనిల్ రావిపూడి ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: విక్టరీ వెంకటేష్(Venkatesh), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam). ఐశ్వర్య రాజేష్(aishwarya Rajesh), మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు(Dil Raju) నిర్మించారు. వీటీవీ గణేష్(VTV Ganesh), ఉపేంద్ర లిమయే(Upendra Limaye), నరేష్(Naresh), అవసరాల శ్రీనివాస్(avasarala Srinivas) కీలక పాత్రల్లో నటించారు.

దీనికి భీమ్స్ సిసిరోలియో(Bheems Ceciroleo) సంగీతాన్ని అందించారు. అయితే సంక్రాంతి కానుకగా జనవరి 14న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి ఫస్ట్ ఆటనుంచే పాజిటీవ్ టాక్‌ను అందుకుంటూ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అలాగే కలెక్షన్ల విషయంలోనూ సునామీ సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్ నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం. ఆడియన్స్ లేకపోతే ఈ విజయాన్ని మేము ఊహించలేము.

ఎర్లీ మార్నింగ్ షోస్‌కి కుటుంబంతో కలిసి సినిమా చూశారంటే మామూలు విషయం కాదు. ఇలాంటి అద్భుతాలు చూస్తూ ఎంజాయ్ చేయడమే. నా కెరియర్‌లో ఇది ఒక మిరాకిల్. ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నాను. ఈ సినిమా సక్సెస్‌లో మేజర్ క్రెడిట్ వెంకటేష్ గారికి దక్కుతుంది. ఆయన సపోర్ట్‌ని మర్చిపోలేను. సినిమా టీమ్ అందరికీ పేరుపేరునా థాంక్యూ. నిర్మాత హ్యాపీగా ఉండాలనే టార్గెట్ పెట్టుకుని సినిమాను తీస్తుంటాను. ఇప్పటివరకు ఎనిమిది సినిమాలు చేస్తే ఆరు సినిమాలు రాజు గారితో చేశాను.

ఎస్వీసీ బ్యానర్ ఎన్నో గొప్ప చిత్రాలు తీసిన బ్యానర్. ఆ బ్యానర్ కొన్ని జనరేషన్స్ ఉండాలి, ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్స్ ఈవెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. డిస్ట్రిబ్యూటర్స్‌కి వచ్చిన నెంబర్స్ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ సంవత్సరం సంక్రాంతి డిస్ట్రిబ్యూటర్స్‌కి మెమరబుల్ అయింది. ఈ సినిమా ద్వారా నేనెప్పుడూ వినలేను, చూడలేనేమో అనుకునే రెండు జరిగాయి. ఆరు రోజుల్లో 100 కోట్లు షేర్ కొట్టింది. రీజనల్ ఫిలింకి చూడలేనేమో అనుకున్న 300 గ్రాస్ నెంబర్ చూడబోతున్నాను.

చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ చేయబోయే సినిమాలకు చాలా బాధ్యత పెరిగింది. ఈసారి డిస్ట్రిబ్యూటర్స్‌తో వేడుక జరిగింది నెక్స్ట్ ఎగ్జిబిటర్స్‌తో కూడా ఒక ఈవెంట్ చాలా గ్రాండ్ గా నిర్వహించి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్ షీల్డ్స్‌ని అందరికీ ఇవ్వాలని భావిస్తున్నాం. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


Next Story

Most Viewed