- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Kammam: ఇసుక తోడేళ్లు.. అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేదా?

ఏజెన్సీ ప్రాంతమైన ఇల్లెందు నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా పట్టపగ్గాల్లేకుండా పోతోంది. ఏజెన్సీ చట్టాల ప్రకారం అనుమతి లేకుండా ఇసుకను రవాణా చేయకూడదని తెలిసినా కొంతమంది యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. టేకులపల్లి మండలంలోని శంభునిగూడెం, సంపత్‌నగర్, ముర్రేడు వాగు తదితర ప్రాంతాల నుంచి అక్రమంగా ఇసుకను ఇల్లెందు, కొత్తగూడెం ప్రాంతాలకు తరలిస్తున్నారు. నిత్యం ఈ మార్గాలలో 50కి పైగా ట్రాక్టర్లలో ఇసుకను రాత్రి వేళల్లో రవాణా చేస్తున్నారు. దీంతో అవసరానికి ఇసుక దొరకడం లేదని విసుగు చెందిన టేకుపల్లి మండంలోని కిష్టారం, పాత లచ్చగూడెం గ్రామాల వారు గత మంగళవారం రాత్రి ఐదు ఇసుక ట్రాక్టర్లను అడ్డుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. టేకులపల్లి ఇల్లెందు ప్రధాన రహదారిలో ఇసుక అక్రమ రవాణా పెద్దఎత్తున జరుగుతున్నట్లు తెలుస్తున్నది. కొన్నేళ్లుగా ఇసుక రవాణా జరుగుతున్నా.. సంబంధిత అధికారులు నిలువరించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
దిశ, ఇల్లెందు: ఏజెన్సీ ప్రాంతమైన ఇల్లెందు నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా మితిమీరిపోతుంది.. ఏజెన్సీ చట్టాల ప్రకారం అనుమతులు లేకుండా ఇసుకను రవాణా చేయకూడదు.. కానీ కొంతమంది అక్రమ ఇసుక రవాణాతో రూ. కోట్లు గడిస్తున్నారు.. తోడేళ్లకు తమ్ముళ్లవలె అటవీ ప్రాంతంలోని చెరువులోని విలువైన ఇసుకను రూ. రూపాయి పెట్టుబడి లేకుండా లేకుండా ట్రాక్టర్‌కు రూ.8వేలు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. నిత్యం రోజుకు 50నుంచి 70 ట్రాక్టర్ల వరకు అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు.. ఒకటి కాదు రెండు కాదు కాన్వాయ్ వలె ఈ ఇసుక ట్రాక్టర్లు మితి మీరిన వేగంతో దూసుకెళ్తున్నాయి. కొన్నేళ్లుగా ఈ అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నా.. సంబంధిత అధికారులు నామమాత్రపు తనిఖీలు చేపట్టి ట్రాక్టర్లను పట్టుకుంటున్నారే తప్ప అక్రమ ఇసుక రవాణాకు సంబంధించి పూర్తిస్థాయిలో నిలువరించకపోవడంపై సర్వత్రా విమర్శలు బాహాటంగానే వినపడుతున్నాయి. రోజుకు 50లక్షలకు పైగా విలువైన అక్రమ ఇసుక రవాణా జరుగుతోందంటే అతిశయోక్తి లేదు.
టేకులపల్లి నుంచి ఇల్లెందుకు..
ఇల్లెందు నియోజకవర్గంలోని టేకులపల్లి మండలం శంభుని గూడెం, సంపత్ నగర్, ముర్రేడు వాగు తదితర ప్రాంతాల నుంచి అక్రమంగా ఇల్లెందు, కొత్తగూడెం ప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్నారు. నిత్యం ఈ మార్గాలలో 50కి పైగా ట్రాక్టర్లలో అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నది వాస్తవం అంటూ ప్రజలు వాపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని చట్టాలకు తూట్లు పొడుస్తూ, నిబంధనలను నీళ్లలో తాగేస్తున్న అక్రమ ఇసుక దందా దారులను ఏం చేయలేకపోవడం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెల్ల బంగారమైన ఇసుకను కాపాడాల్సిన సంబంధిత శాఖ అధికారులు పూర్తిస్థాయిలో అక్రమ ఇసుక రవాణాపై నిఘా పెట్టడం లేదని, అందుకే అక్రమ ఇసుక రవాణా రై రై అంటూ రంకెలేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టేకులపల్లి ఇల్లెందు ప్రధాన రహదారిలో జరిగే ఈ ఇసుక అక్రమ రవాణాపై జిల్లా యంత్రాంగం కన్నేస్తే తప్ప నిలువరించలేరని విమర్శలు లేకపోలేవు.
గ్రామస్తుల అడ్డగింత..
ప్రతిరోజు రాత్రి వేళలో ఇష్టారాజ్యాంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుండగా .. ట్రాక్టర్ల మోతతో స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ముర్రేడు వాగు నుంచి యదేచ్ఛగా అక్రమ రవాణా చేస్తుండడంతో స్థానికుల అవసరాలకు ఇసుక లభించడం లేదు. దీంతో విసుగు చెందిన కిష్టారం, పాత లచ్చగూడెం గ్రామాల వారు గత మంగళవారం రాత్రి ఐదు ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. దీంతో ఇసుక రవాణా దారులకు, స్థానికులకు మధ్య వాగ్వాదం నెలకొంది. పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లను అటవీ అధికారులకు అప్పగించడం చెప్పుకోదొక విషయం.
అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు.. బత్తుల సత్యనారాయణ, ఇల్లెందు సీఐ
ఏజెన్సీ ప్రాంతమైన ఇల్లెందులో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అక్రమ ఇసుక రవాణాకు సంబంధించి ఎవరినైనా ఉపేక్షించేది లేదు.
ఇసుక రవాణాపై ఫిర్యాదులందాయి.. నాగ భవాని, తహసిల్దార్, టేకులపల్లి
మండలంలో అక్రమ ఇసుక రవాణాపై ఫిర్యాదులు అందాయి. సిబ్బంది కొరత తక్కువగా ఉన్నందున ఇబ్బందులు పడుతున్నాం. ఆర్డీఓ, కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.