తహసీల్దార్ కార్యాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం

by Jakkula Mamatha |
తహసీల్దార్ కార్యాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం
X

దిశ, గుర్రంపోడు:రెవెన్యూ అధికారులు తమ సమస్యలను పట్టించుకోవడం లేదంటూ గుర్రంపోడు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..గుర్రంపోడు మండలంలోని తెరాటిగూడెం గ్రామానికి చెందిన కసిరెడ్డి చిన మల్లారెడ్డికి ఆయన సోదరుడైన రామకృష్ణ రెడ్డికి భూ వివాదాలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం చిన్న మల్లారెడ్డి బోరుబావిని ఆర్ఐ మురళీ కృష్ణ సీజ్ చేశారు. దీంతో తన పంట పొలాలు, తోట ఎండిపోతున్నాయని, నా బోరుబావిని ఎందుకు అక్రమంగా సీజ్ చేశారని ఆర్ఐ మురళీ కృష్ణని నిలదీశాడు. దీంతో రైతు ప్రశ్నించడంతో ఆర్ ఐ నీ దిక్కున్న చోట చెప్పుకో అని రైతుని గల్లా పట్టి గెంటేయడంతో మనస్తాపానికి గురైన రైతు పురుగుల మందు తాగాడు. దీంతో విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై శివప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని రైతుని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed