- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Cockroach : ఇడ్లీలో బొద్దింక..అక్కడెక్కడో కాదండి మన జగిత్యాలలోనే
దిశ, జగిత్యాల కలెక్టరేట్: హోటల్ లో బ్రేక్ ఫాస్ట్ చేద్దాం అని వెళ్ళిన కస్టమర్ కు వింత అనుభవం ఎదురయింది. ఇడ్లీ ఆర్డర్ చేసి సగం తిన్న తర్వాత ఓ ఇడ్లీలో పెద్ద సైజ్ బొద్దింక ప్రత్యక్షమైంది. ఈ ఘటన జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో గల ముత్తు టిఫిన్ సెంటర్లో చోటు చేసుకుంది. ఊహించని ఈ పరిణామంతో షాక్ తిన్న కస్టమర్ హోటల్ యాజమానిని ప్రశ్నించాడు. నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో కస్టమర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కనీస జాగ్రత్తలు పాటించకుండా పెద్ద సైజు బొద్దింకలు ఇడ్లీలో రావడం ఏంటని హోటల్ యజమాని తో వాగ్వాదానికి దిగాడు.
ఇదిలా ఉండగా కొద్దిరోజుల క్రితం జగిత్యాల తహసీల్ చౌరస్తా వద్ద గల ఓ ఉడిపి హోటల్ లో ఇడ్లీలో జెర్రీ రావడం.. తాజాగా ముత్తు టిఫిన్ సెంటర్లో ఏకంగా పెద్ద సైజు బొద్దింక రావడం టిఫిన్ సెంటర్ లలో పాటిస్తున్న జాగ్రత్తలు, నాణ్యత ప్రమాణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇష్టారీతిన రేట్లు పెంచేసుకున్న టిఫిన్ సెంటర్ ల యాజమాన్యాలు కస్టమర్లకు నాణ్యమైన ఫుడ్ అందించడంలో మాత్రం శ్రద్ధ చూపడం లేదు. మరోవైపు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఫైన్ లు వేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప కఠినంగా వ్యవహరించడం లేదని పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు పాటించకుండా నాణ్యతలేని ఫుడ్ అందిస్తున్న హోటల్స్ పై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు.