- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
NTR 31: ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాలో ఆ యంగ్ హీరోయిన్ ఫిక్స్.. కానీ కండిషన్స్ అప్లై!
దిశ, సినిమా: ‘దేవర’ (Devara) చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకు ఎన్టీఆర్.. ప్రజెంట్ బాలీవుడ్ (Bollywood) చిత్రం ‘వార్-2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. దీంతో పాటు.. ఎన్టీఆర్ (NTR), ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్‌లో మరో సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కేజీఎఫ్ (KGF), సలార్ (salaar) వంటి చిత్రాలతో బాక్సాఫీస్ (box office) వద్ద భారీ విజయాలను అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబో ప్రకటించడంతో.. సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ 31వ చిత్రంగా రాబోతున్న ఈ మూవీని గతంలో పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. అప్పటి నుంచి ఈ చిత్రంపై మరో అప్‌డేట్ రాలేదు.
ఈ క్రమంలోనే తాజాగా ఎన్టీఆర్ 31 లో నటించే హీరోయిన్‌పై ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్‌గా నటించబోతున్నట్లు ఫిలిమ్ వర్గాల నుంచి సమాచారం. అంతే కాదు.. జనవరి 9, 2026న డ్రాగన్ (NTR 31) విడుదలయ్యే వరకు తను ఎలాంటి ఇతర చిత్రాలకు సైన్ చేయడానికి అనుమతి లేదని పేర్కొంటూ రుక్మిణి వసంత్‌కు కండీషన్ పెట్టారట. దీనికి ఒప్పుకుంటూ ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ చిత్రానికి సంతకం చేసిందట హీరోయిన్. అయితే.. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.
Read More...
Game changer: ‘గేమ్ చేంజర్’ నుంచి వచ్చేసిన మూడో పాట.. అలరిస్తున్న ‘నానా హైరానా’