టేకు కలప పక్కదారి స్టోరీపై అధికారులు విచారణ

by Naveena |
టేకు కలప పక్కదారి స్టోరీపై అధికారులు విచారణ
X

దిశ హుజూర్ నగర్ : ప్రభుత్వం నుంచి అనుమతులు పొందకుండా టేకు చెట్లను నరికి అక్రమంగా రవాణా చేస్తున్న విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు ఆ టేకు కలపను తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకున్నారు. టేకు కలపను స్వాధీన పరచుకొని నిందితులపై కేసులు నమోదు చేయకుండా హుజూర్ నగర్ ఫారెస్ట్ రేంజ్ అధికారి ఆనంద్ రెడ్డి తో పాటు..గరిడేపల్లి పరిధిలోని సెక్షన్ ఆఫీసర్ గోవర్ధన్ ను వదిలేలివేయడంతోపాటు టేకు కలప పక్కదారి పట్టించారని సోమవారం దిశ పత్రికలో కథనం ప్రచురించడం జరిగింది. దీనిపై స్పందించిన ఉమ్మడి నల్లగొండ ఇంచార్జ్ సిఎఫ్ పద్మజారాణి విచారణకు ఆదేశించిందనీ సమాచారం. విచారణకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ విజిలెన్స్ అధికారులతో పాటు..డీఎఫ్ఓను కూడా విచారణ చేయమన్నట్లు తెలుస్తుంది. అయితే విచారణ చేసే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారు పూర్తిస్థాయిలో విచారణ చేస్తారా ..?. లేక మా డిపార్ట్మెంట్ లే మా..అధికారిలే.. !అని నామమాత్రపు విచారణ చేసి రిపోర్టు ఇస్తారా.. !?అనే అంశం ప్రజలలో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి అధికారులపై ప్రభుత్వం ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed