తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ మంజూరు: ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు

by srinivas |
తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ మంజూరు:   ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలతోనే కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందని కాంగ్రెస్ ఎంపీలు తెలిపారు. తెలంగాణ ఎంపీల కన్వీనర్ మల్లు రవి ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలో టీజీఎంపీలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్​ కుమార్ రెడ్డి, కడియం కావ్య, రఘురామ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లు మాట్లాడుతూ.. వరంగల్ ప్రజల కల కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అని, దీని కోసం సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఢిల్లీకి వచ్చి ప్రధానిని కోరారని వెల్లడించారు. సీఎం రేవంత్ ప్రయత్నాలు, పట్టుదలతోనే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాంక్షన్ అయిందన్నారు. 2025 ఆగస్టు వరకు ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తవుతుందని రైల్వే ఉన్నతాధికారులు చెప్పారన్నారు. తొలుత వ్యాగన్ తయారీ కేంద్రం ఇవ్వగా, ఆ తర్వాత దాన్ని రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ గా మార్చారని, ఇప్పుడు పూర్తిగా వందే భారత్ కోచ్ లు కూడా తయారుచేసేలా ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. ఇందుకు మరో 200 ఎకరాల స్థలం కావాలని కేంద్రం కోరగా, ఆ స్థలం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ఎంపీలు వివరించారు. ఇక కేటీఆర్ తన అస్తిత్వం కోసమే స్టేట్మెంట్స్ ఇస్తూ ప్రభుత్వంపై బురద జల్లుతున్నాడని మండిపడ్డారు. బీజేపీ చెప్పు చేతుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నదని, అందుకే మహారాష్ట్ర లో పోటీ చేయలేదన్నారు. ఫెడరల్ స్పూర్తితో భాగంగానే స్టేట్ డెవలప్ కు కేంద్రం సహకరిస్తుందని వివరించారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం లో ఏ పార్టీ పవర్ లో ఉన్నా, రాష్ట్రాలకు సహకరించాల్సిందేనని నొక్కి చెప్పారు.

ఇక బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు బీజేపీ ఏం చేప్తే అది చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ నేతల అటెండెన్స్ కూడా కనిపించడం లేదన్నారు. పదేళ్ళలో బీఆర్ఎస్ ఎంపీలు కేంద్రమంత్రులను కలిసి, నిధులు తీసుకువచ్చిన చరిత్ర లేదన్నారు. తమ పనితీరును కేంద్ర మంత్రులు కూడా మెచ్చుకుంటున్నారన్నారు. 2026 లో ఖేలో ఇండియా తెలంగాణలో జరగబోతున్నాయన్నారు.

కేటీఆర్ భజన మండలి 10 ఏళ్లలో ఏం తెచ్చారో? స్పష్టం చేయాలన్నారు. ఇక కేసీఆర్ నల్ల చట్టాలకు మద్దతు తెలిపారన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్, బీజేపీ కి మద్దతు తెలిపిందన్నారు. ఇక అదాని పై వచ్చిన ఆరోపణలపై ప్రధానమంత్రిని రాజీనామా చేయాలని తాము పార్లమెంట్ లో కోరుతున్నామన్నారు. ప్రజలు ఐదేళ్లు అధికారం చేయమని మాత్రమే బీజేపీకి మద్ధతు ఇచ్చారని, కానీ బీజేపీ కార్పొరేట్లను మరింత కాస్ట్ లీగా చేస్తుందని ఎంపీలు మండిపడ్డారు. పదే పదే తమ సీఎం ఢిల్లీకి వెళ్తున్నాడని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని, తెలంగాణ ప్రజల కోసం మాత్రమే ఆయన ఢిల్లీకి వస్తున్నారన్నారు. అసలు బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ఎందుకు కట్టుకున్నారో? స్పష్టం చేయాలన్నారు.

మరోవైపు గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్, కేటీఆర్‌లు విభజన హామీగా ఉన్న కోచ్ ఫ్యాక్టరీ గురించి కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయలేదని ప్రశ్నించారు. తమ సీఎం రేవంత్ పదే పదే కేంద్రం వెంటపడి సాధించారన్నారు. 28 సార్లు ఢిల్లీకి ఎందుకు వెళ్లారో ఇప్పుడు అర్ధమైందా? అంటూ ఎంపీలు చురకలు అంటించారు. తెలంగాణ సమస్యలపై బీజేపీ ఎంపీలను కలుపుకొని వెళ్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా తమకు సమస్యలేదని, రాష్ట్ర అవసరాల కోసం రమ్మని స్వయంగా రాజ్ నాథ్ సింగ్ ఆహ్వానించారని వెల్లడించారు. తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ నేతలకు సిగ్గుండాలని టీజీ ఎంపీలు విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed