China : 3.2 కోట్ల హెక్టార్ల ఎడారిని అడవిగా మార్చిన చైనా

by Hajipasha |
China : 3.2 కోట్ల హెక్టార్ల ఎడారిని అడవిగా మార్చిన చైనా
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రపంచంలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా చైనా(China) మారింది. ‘తక్లీ మాకన్’.. ఇది చైనాలోని అతిపెద్ద ఎడారుల్లో ఒకటి. చైనా ప్రభుత్వం ఈ ఎడారి చుట్టూ దాదాపు 3,046 కి.మీ ఇసుక తిన్నెల ఏరియాను పచ్చదనంలోకి మార్చింది. ఈ ప్రక్రియ గురువారం ఉదయం నాటికి పూర్తయిందని అధికార వర్గాలు ప్రకటించాయి. ప్రపంచంలోనే అత్యధిక విస్తీర్ణంలో ఎడారిని అడవిగా మార్చిన ఘనతను చైనా సొంతం చేసుకుందని తెలిపాయి.

‘తక్లీ మాకన్’ ఎడారి(Taklimakan Desert)ని అడవిగా మార్చే విప్లవాత్మక ప్రాజెక్టును 1978లో చైనా ప్రారంభించింది. ఇప్పటివరకు ఈ ఎడారి మధ్యలోనున్న 3.2 కోట్ల హెక్టార్ల ప్రాంతాన్ని అడవిగా మార్చారు. 2050 నాటికి మొత్తం ఎడారిని పచ్చదనంతో నింపేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా ఈ ఏడారి చుట్టూ ఉండే ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed