Maharashtra CM: మహారాష్ట్ర సీఎం ఎంపికపై అమిత్ షా కీలక భేటీ

by Mahesh Kanagandla |
Maharashtra CM: మహారాష్ట్ర సీఎం ఎంపికపై అమిత్ షా కీలక భేటీ
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర ముఖ్యమంత్రి(Maharashtra CM) పీఠంపై సస్పెన్స్ వీడలేదు. మహాయుతి నేతలు ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde), దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis), అజిత్ పవార్‌(Ajit Pawar)లతో కేంద్రమంత్రులు అమిత్ షా(Amit Shah), జేపీ నడ్డాలు సమావేశమయ్యారు. ఢిల్లీలో ఈ సమావేశం సుమారు రెండు గంటలపాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపికపై, డిప్యూటీ సీఎంలు ఎవరనేది నిర్ణయిస్తారని ప్రచారం జరిగింది. మినిస్టర్ బెర్తులు ఏ పార్టికి ఎన్ని కేటాయించాలనేదానిపైనా ప్రాథమికంగా నిర్ణయానికి వస్తారని చెప్పారు. పవర్ షేరింగ్ ఫార్ములాపైనా డిస్కషన్ ఉంటుందని పార్టీవర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే గురువారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఢిల్లీలోనే అమిత్ షా నివాసంలో ఈ సమావేశం జరిగింది. రెండు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనేదానిపై ఏ నాయకుడూ వెల్లడించలేదు. రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే బుధవారం సాయంత్రం ఢిల్లీ చేరుకుని నేరుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసానికి వెళ్లారు. అప్పటికే అక్కడున్న కేంద్ర మంత్రి జేపీ నడ్డాలు చర్చలు జరిపారు. రాత్రి సుమారు 10.30 గంటల ప్రాంతంలో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్‌లు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.

‘రెండు డిప్యూటీ పోస్టులు ఉంటాయి’

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేది తేల్చే నిర్ణయాన్ని బీజేపీ పెద్దలకే విడిచిపెడుతున్నట్టు ఆపద్ధర్మ సీఎం, శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండే బుధవారం వెల్లడించారు. ముఖ్యమంత్రి ఎంపికపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి అమిత్ షాలతో తాను ఏకీభవిస్తానని, వారి నిర్ణయాన్ని శిరసావహిస్తానని వివరించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆటంకిగా ఉండబోనని వారికి హామీ ఇచ్చినట్టు చెప్పారు. ఇది వరకే ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ బీజేపీ నేత సీఎం అయితే అభ్యంతరం లేదనే సంకేతాలు ఇచ్చారు. రాష్ట్ర బీజేపీ నేతలు, ఆర్ఎస్ఎస్ నేతలు కూడా దేవేంద్ర ఫడ్నవీస్‌ను సీఎం చేయాలని డిమాండ్‌ చేశాయి. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌ పేరు దాదాపుగా ఖరారైనట్టేనని చర్చించుకుంటున్నారు. కాగా, కొత్త ప్రభుత్వంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉంటారని ఇది వరకే ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ తెలిపారు. కొత్త సీఎం నవంబర్ 30 లేదా డిసెంబర్ 1వ తేదీన ప్రమాణ స్వీకారం చేయవచ్చని వివరించారు.

ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర సీఎం సీటుపై తన పట్టును విడిచినట్టుగానే సంకేతాలు వచ్చాయి. అలాగని, డిప్యూటీ సీఎంగానూ ఆయన కొనసాగబోరని శివసేన ప్రతినిధి తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలోనూ చేరబోరని, మహారాష్ట్ర మంత్రివర్గంలోనే ఉంటారని శివసేన నేతలు తెలిపారు. రాష్ట్ర కేబినెట్‌లో ముఖ్యమైన పోర్ట్‌ఫోలియోను తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. లేదంటే తన కొడుకు ఎంపీ శ్రీకాంత్ షిండేకు డిప్యూటీ సీఎం పోస్టు ఇవ్వాలని, లేదంటే మహాయుతి కన్వీనర్‌గా తనకు అవకాశం ఇవ్వాలని ఏక్‌నాథ్ షిండే ప్రతిపాదించారని, కానీ, వీటిని బీజేపీ నాయకత్వం తోసిపుచ్చినట్టు వార్తలు వచ్చాయి.

Advertisement

Next Story

Most Viewed