- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
SIT: నేడు సిట్ విచారణకు విజయసాయి రెడ్డి.. రాజ్ కసిరెడ్డి తండ్రికీ నోటీసులు

దిశ, వెబ్‌డెస్క్: జగన్ ప్రభుత్వ (YCP Government) హయాంలో జరిగిన లిక్కర్ స్కాం (Liquor Scam)లో కూటమి సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ మేరకు కేసులో మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy)కి బుధవారం నోటీసులను కూడా జారీ చేశారు. ఆ నోటీసులలో ఈనెల 18న విచారణకు హాజరుకావాలని పేర్కొనగా.. ఆయన గురువారమే విచారణకు వస్తానంటూ చివరి నిమిషంలో రావట్లేదని సిట్ అధికారులకు సమాచారం అందజేశారు. దీంతో నోటీసులలో పేర్కొన్న విధంగా ఇవాళ ఆయన విజయవాడ పోలీసుల కమిషనరేట్ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు. అయితే, సిట్ దర్యాప్తులో భాగంగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి ఇప్పటికే నోటీసులు జారీ చేయగా ఆయన ఎలాంటి సమాధానం రాలేదు. ఈ క్రమలోనే తాజగా కసిరెడ్డి తండ్రి ఉపేందర్‌ను విచారణకు రావాలంటూ సిట్ అధికారులు నోటసులు జారీ చేశారు.
అయితే, కాకినాడ పోర్టు (Kakinada Port), సెజ్ వాటల (SEZs) కేసు విషయంలో ఈ నెల 12న సీఐడీ (CID) విచారణకు హాజరైన అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరిగిన లిక్కర్ స్కాం (Liquor Scam)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. స్కాంలో సూత్రధారి, పాత్రధారి రాజ్ కసిరెడ్డే (Raj Kasireddy)నని కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే నేడు సిట్ అధికారులు విజయసాయి రెడ్డి లిక్కర్ స్కాంలో చెప్పే వాస్తవాలు, ఇచ్చే సమాచారాన్ని స్టేట్‌మెంట్ రూపంలో రికార్డు చేయనున్నట్లుగా తెలుస్తోంది. కాగా, ఇదే కేసులో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డితో పాటు మరో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సీట్ నుంచి నోటీసులు అందాయి. ఈ మేరకు ఆయనను ఇవాళ విచారణకు రావాలంటూ నోటీసులలో పేర్కొన్నారు. అయితే, విజయసాయి రెడ్డి పార్టీ మారుతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్న వేళ సిట్ అధికారులకు ఆయన ఇచ్చే వాంగ్మూలంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.