- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AIMPLB : అజ్మీర్ దర్గాపై పిటిషన్.. సీజేఐకు ముస్లిం పర్సనల్ లా బోర్డ్ విజ్ఞప్తి
దిశ, నేషనల్ బ్యూరో : రాజస్థాన్‌లోని అజ్మీర్(Ajmer) దర్గాలో శివాలయం ఉందంటూ దాఖలైన పిటిషన్‌పై ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్(AIMPLB) స్పందించింది. ఆ పిటిషన్‌ను విచారించిన అజ్మీర్ కోర్టు కేంద్ర ప్రభుత్వం, అజ్మీర్ దర్గా కమిటీ, ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలకు నోటీసులు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘‘ప్రాచీన ప్రార్థనా స్థలాల స్టేటస్ అనేది 1947 ఆగస్టు 15 నాటికి ఎలాగైతే ఉందో.. అలాగే కంటిన్యూ అవుతుందని ‘ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ - 1991’ చెబుతోంది. అయినా ప్రాచీన కట్టడమైన అజ్మీర్ దర్గా ఉనికిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకోవడం సరికాదు. ఆ పిటిషన్.. చట్టాలు, రాజ్యాంగాన్ని అవహేళన చేసేలా ఉంది’’ అని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ పేర్కొంది.
ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(CJI) జస్టిస్ సంజీవ్ ఖన్నాను కోరింది. ఇలాంటి వివాదాస్పద పిటిషన్లు దాఖలైనప్పుడు.. కొత్త వివాదాలకు తలుపులు తెరవకుండా వ్యవహరించాలని దిగువ కోర్టులకు సూచించాలని సీజేఐకు ముస్లిం పర్సనల్ లా బోర్డ్ విజ్ఞప్తి చేసింది. ‘‘బాబ్రీ మసీదు కేసును విచారించే క్రమంలో ‘ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ - 1991’ గురించి సుప్రీంకోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది. ప్రాచీన ప్రార్థనా స్థలాలను క్లెయిమ్ చేసుకుంటూ దాఖలయ్యే పిటిషన్లను ఉపేక్షించకూడదని అప్పట్లో దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇకపై మసీదులు, ఇతర ప్రార్థనా స్థలాలను ఎవరూ లక్ష్యంగా చేసుకోకూడదని సుప్రీంకోర్టు ఆనాడు చెప్పింది’’ అని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్.క్యూ.ఆర్.ఇలియాస్ పేర్కొన్నారు.