- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TG Assembly: అసెంబ్లీలో కాగ్ నివేదిక.. పన్నుల నుంచి వచ్చిన ఆదాయంపై భట్టి కీలక ప్రకటన

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ సమావేశాలు (Assembly Sessions) చివరి రోజు కొనసాగుతున్నాయి. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Prasad Kumar) అనుమతితో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Vikramarka) సభలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను కాగ్ (Comptroller and Auditor General of India) రిపోర్టును ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా సభలో ఆయన సభలో మాట్లాడుతూ.. వచ్చిన రిపోర్టు ప్రకారం 2023-24 బడ్జెట్ అంచనా రూ.2,77,690 కోట్లుగా ఉండగా.. అందులో ఖర్చు చేసిన వ్యయం రూ.2,19,307 కోట్లని తెలిపారు. అనుకున్న బడ్జెట్ (Budget) అంచనాలో దాదాపు 79 శాతం ఖర్చు చేశారని పేర్కొన్నారు. ఆమోదం పొందిన బడ్జెట్ కంటే అంచనాల్లో 33 శాతం ఖర్చు అయిందని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ ఖజానా (Government Treasury)కు వివిధ టాక్స్‌ల ద్వారా వచ్చిన ప్రాఫిట్ 61.83 శాతం అని తెలిపారు. 2023-24లో ఆర్థిక సంవత్సరంలో వడ్డీల చెల్లింపుల కోసం అక్షరాలా రూ.24,347 కోట్లు వెచ్చించారని, ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలకు గాను వేతనాలకు రూ.26,981 కోట్లు ఖర్చు చేశారని భట్టి సభ దృష్టి తీసుకొచ్చారు.
హరీశ్‌రావుపై స్పీకర్‌కు ఆది శ్రీనివాస్ ఫిర్యాదు..
బుధవారం అసెంబ్లీ (Assembly)లో మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఫొటోలు తీసిన విషయాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దృష్టి తీసుకెళ్లారు. ఈ మేరకు అసెంబ్లీ నియమ నిబంధనలను దృష్టిలో హరీశ్‌రావుపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆది శ్రీనివాస్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.