Murmu: స్వావలంబన దిశగా భారత్ అడుగులు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

by vinod kumar |
Murmu: స్వావలంబన దిశగా భారత్ అడుగులు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
X

దిశ, నేషనల్ బ్యూరో: భవిష్యత్ సవాళ్లు ఎదుర్కొనేందుకు సాయుధ బలగాలను సిద్ధంగా ఉంచేందుకు భారత్ స్వదేశీకరణ, స్వావలంబన దిశగా పయనిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi murmu) అన్నారు. వేగంగా మారుతున్న భౌగోళిక వాతావరణంలో ఎలాంటి పరిస్థితినైనా తట్టుకునేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. తమిళనాడు (Thamilnadi)లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కళాశాలలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ముర్ము ప్రసంగించారు. ప్రస్తుత తరుణంలో జాతీయ, ప్రపంచ సమస్యలపై లోతైన అవ గాహన కలిగి ఉండటం ఎంతో అవసరమని నొక్కి చెప్పారు. జాతీయ ప్రయోజనాలకు కాపాడుకోవడమే కాకుండా సైబర్ వార్ ఫెర్, టెర్రరిజం వంటి నూతన భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు సాయుధ బలగాలు సిద్ధం కావాలన్నారు. భారత్ రక్షణ ఎగుమతి దారుగా మాదే దిశగా అడుగులు వేస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆత్మ నిర్భర్ భారత్‌కు అనుగునంగా ముందుకు సాగుతోందన్నారు. ప్రస్తుతం భారత్ 100 కంటే ఎక్కువ దేశాలకు రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తోందని తెలిపారు. మూడు సర్వీసుల్లో మహిళా అధికారులు నాయకత్వం వహించడం ఎంతో గర్వకారణమని కొనియాడారు.

Advertisement

Next Story

Most Viewed