- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Israel: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. కాల్పుల విరమణ వేళ కీలక పరిణామం
దిశ, నేషనల్ బ్యూరో: కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన మరుసటి రోజే లెబనాన్(Lebanon)పై ఇజ్రాయెల్ (Israel) దాడి చేసింది. దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా రాకెట్ స్టోరేజ్ సైట్‌పై తమ యుద్ధ విమానాలు దాడి చేశాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(IDF) తెలిపింది. ఆ ప్రాంతంలో హిజ్బుల్లా మిలిటెంట్ల కార్యకలాపాలు గుర్తించామని ఆ తర్వాత దాడులకు పాల్పడ్డామని వెల్లడించింది. ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, కానీ ఇద్దరు లెబనాన్ పౌరులు గాయపడ్డారని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే హిజ్బుల్లా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ఇజ్రాయెల్ ఆరోపించింది. అనేక మంది అనుమానితులను దక్షిణ లెబనాన్‌లోని సైనిక ప్రాంతాలకు తరలిస్తున్నట్లు గుర్తించామని, అందుకే వారిపై అటాక్ చేశామని స్పష్టం చేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించింది. మరోవైపు ఈ దాడిపై హిజ్బుల్లా స్పందించింది. సరిహద్దుకు ఆనుకుని ఉన్న గ్రామాలకు తిరిగి వస్తున్న వారిపై ఇజ్రాయెల్ దాడి చేస్తోందని ఆరోపించింది.
కాగా, అమెరికా, ఫ్రాన్స్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, హిజ్బుల్లాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ ఒప్పందం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఇరు వైపులా 60 రోజుల పాటు కాల్పుల విరమణ అమలులో ఉంటుంది. ఇది ప్రారంభమైన కొద్ది గంటల తర్వాత, ఉత్తర లెబనాన్ నుంచి ప్రజలు దక్షిణ లెబనాన్‌కు తిరిగి రావడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్, హిజ్బుల్లా ఒప్పందాన్ని ఉల్లంఘించారని పరస్పరం ఆరోపణలు చేసుకోవడం గమనార్హం. దీంతో మరోసారి ఆందోళనలు నెలకొన్నాయి.