- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Putin : ఉక్రెయిన్ ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేస్తాం : పుతిన్
దిశ, నేషనల్ బ్యూరో : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Putin) మరోసారి ఉక్రెయిన్(Ukraine)కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ అణ్వాయుధాలను పొందేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తే.. తమ వద్దనున్న అన్ని రకాల ఆయుధాలతో భీకర దాడులు చేస్తామని వెల్లడించారు. గత 33 నెలల యుద్ధంలో తాము ఎన్నడూ ఉక్రెయిన్ పార్లమెంటు, అధ్యక్ష కార్యాలయం, మంత్రుల ఆఫీసులపై దాడులు చేయలేదన్న పుతిన్.. ఇకపై ఒరెష్నిక్ హైపర్ సోనిక్ మిస్సైళ్లతో వాటిపై దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఒరెష్నిక్ మిస్సైల్ సెకనుకు 3 కి.మీ వేగంతో లక్ష్యం దిశగా దూసుకెళ్లగలదని పుతిన్ తెలిపారు.
ఉక్రెయిన్ వినియోగిస్తున్న పాశ్చాత్య దేశాల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు దాన్ని ఆపలేవని చెప్పారు. ఒరెష్నిక్ మిస్సైల్‌తో సంభవించే విధ్వంసం భారీగా ఉంటుందన్నారు. ‘‘పశ్చిమ దేశాల లాంగ్ రేంజ్ మిస్సైళ్లతో ఉక్రెయిన్ మాపై దాడులు చేసినన్ని నాళ్లు.. దానిపై ఒరెష్నిక్ మిస్సైళ్లతో దాడులు కొనసాగిస్తాం’’ అని పుతిన్ స్పష్టం చేశారు. ‘‘ఉక్రెయిన్ అణ్వాయుధాన్ని తయారు చేయడం అసాధ్యం. అది డర్టీ బాంబ్‌ను తయారు చేసే అవకాశమైతే ఉంది. ఒకవేళ అలాంటి వాటితో దాడులు చేస్తే.. అదే రేంజులో మేం ప్రతిఘటిస్తాం’’ అని ఆయన చెప్పారు.