- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Yasin Malik : యాసిన్ మాలిక్ కేసు విచారణ ఢిల్లీకి బదిలీపై సుప్రీంకోర్టు సానుకూల స్పందన
దిశ, నేషనల్ బ్యూరో : ప్రస్తుతం ఢిల్లీలోని తిహార్ జైలులో యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తున్న కశ్మీర్ వేర్పాటువాది యాసిన్ మాలిక్(Yasin Malik) వ్యవహారంలో సుప్రీంకోర్టు(Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. కశ్మీర్ మాజీ సీఎం ముఫ్తీ మహ్మద్ సయీద్ కుమార్తె రుబయ్యా సయీద్ కిడ్నాప్ కేసు(1989), నలుగురు భారత వాయుసేన సిబ్బంది హత్యల కేసుల్లోనూ యాసిన్‌పై నేరాభియోగాలు నమోదయ్యాయి. వీటికి సంబంధించిన న్యాయ విచారణను జమ్మూ కోర్టు నుంచి ఢిల్లీకి బదిలీ చేయాలంటూ సీబీఐ(CBI) వేసిన పిటిషన్‌పై దేశ సర్వోన్నత న్యాయస్థానం గురువారం సానుకూలంగా స్పందించింది. ఆ అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది.
‘‘యాసిన్ మాలిక్ నిందితుడిగా ఉన్న ఆ రెండు కేసుల విచారణను జమ్మూ కోర్టు నుంచి ఢిల్లీకి ట్రాన్స్‌ఫర్ చేయండి.ఢిల్లీలోని తిహార్ జైలులో ప్రత్యేక కోర్టు రూం ఉంది. అందులో వీడియో కాన్ఫరెన్సింగ్ వసతి ఉంది. అక్కడే యాసిన్‌ను విచారించండి’’ అని సుప్రీంకోర్టును సీబీఐ కోరింది. ఒకవేళ యాసిన్ మాలిక్‌ను విచారణ నిమిత్తం జమ్మూకశ్మీర్‌కు తీసుకెళ్తే శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పేర్కొంది. న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ ఏజీ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ అభ్యర్థనపై విచారణ జరిపింది. ఈ కేసు విచారణను జమ్మూ నుంచి ఢిల్లీకి బదిలీ చేసే అంశంపై స్పందన తెలపాలంటూ యాసిన్ మాలిక్, సహ నిందితుడిగా ఉన్న మరో వ్యక్తికి కోర్టు నోటీసులు జారీ చేసింది. డిసెంబరు 18లోగా స్పందనను తెలియజేయాలని ఆదేశించింది.