నా పార్థీవ దేహంపై జాతీయ జెండా కప్పే గౌరవాన్ని పొందాను.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉద్వేగం

by Ramesh Goud |
నా పార్థీవ దేహంపై జాతీయ జెండా కప్పే గౌరవాన్ని పొందాను.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉద్వేగం
X

దిశ, వెబ్ డెస్క్: నేను చనిపోతే నా పార్థీవదేహంపై జాతీయ జెండా కప్పే గౌరవాన్ని నేను పోందానని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (BRS MLA Vemula Prashanth Reddy) ఉద్వేగభరిత వ్యాఖ్యలు (Emotional Comments) చేశారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా మంత్రులు (Ministers) ఆయా శాఖలకు సంబంధించిన పద్దులను సభలో ప్రవేశపెడుతున్నారు. ఆర్ అండ్ బీ శాఖ (R and B Department) పద్దులను మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) ప్రవేశ పెట్టారు. దీనిపై చర్చ జరుగుతున్న సందర్భంగా బీఆర్ఎస్ నేత వేముల మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (Former CM KCR) దయవల్ల, బాల్కొండ నియోజకవర్గ ప్రజల (Balkonda Contiency People) దయ వల్ల తాను వరసగా మూడు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యానని తెలిపారు.

అలాగే కేసీఆర్ నాలుగేళ్లు మిషన్ భగీరథ చైర్మన్ గా, ఐదేళ్లు మంత్రిగా తనకు అవకాశం కల్పించారని చెప్పారు. ఈ పదవులలో ఆ దేవుడు తనకు ఇచ్చిన శక్తి మేరకు ఈ రాష్ట్రానికి సేవ చేసుకున్నానని అన్నాడు. అంతేగాక తాను చనిపోతే పార్థీవ దేహంపై జాతీయ జెండా కప్పుతారని, గన్ సెల్యూట్ కూడా చేస్తారని, అతి కొద్దిమందికి దక్కే ఈ గౌరవాన్ని తాను కూడా పొందానని కొంత ఉద్వేగానికి లోనయ్యారు. అయితే ఈ సభలో తనకు అవకాశం ఇచ్చినప్పుడు ఎవరిని కించ పరచకుండా మాట్లాడుతానని, కానీ తాను మాట్లాడే సమయంలోనే సభ్యులు అంతరాయం కలిగిస్తున్నారని అన్నారు. దయచేసి అది లేకుండా చూడాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేస్తున్నానని బీఆర్ఎస్ నేత అన్నారు.

Advertisement
Next Story

Most Viewed