- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BJP: రేవంత్ రెడ్డి పరిపాలన గాలికొదిలేశాడు .. బీజేపీ నేత కాసం వేంకటేశ్వర్లు
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ఏలుబడిలో కాంగ్రెస్ ఏలుబడిలో సంక్షేమ హాస్టళ్లన్నీ సంక్షోభాలకు కేంద్రంగా మారిపోయాయని, హోం, సోషల్ వేల్ఫేర్, ఎడ్యుకేషన్, మున్సిపల్ ఇలా అన్ని మంత్రిత్వ శాఖలను సీఎం రేవంత్ వద్దే అంటిపెట్టుకుని పాలనను గాలికొదిలేశారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వేంకటేశ్వర్లు అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. సీఎం మహారాష్ట్ర, ఢిల్లీ పర్యటనలతో కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పుడ్ పాయిజన్ ఘటనలపై హై కోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదన్నారు. కాంగ్రెస్అధికారంలోకి వచ్చిన తర్వా వివిధ గురుకుల పాఠశాలల్లో 51మంది విద్యార్థులు చనిపోయారని వీరి చావులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా 886 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, 38 గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదయ్యాయన్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ కుటుంబానికి ఊడిగం చేసుకోవడమే తప్ప పేద ప్రజల గురించి ఆలోచించే సోయి లేదన్నారు. సంక్షేమ హాస్టళ్లలో ప్రతిపక్షాలు కుట్రచేసి పిల్లల్ని చంపేస్తున్నరంటూ మంత్రి సీతక్క మాట్లాడం సిగ్గు చేటన్నారు. ప్రతిపక్షాల మీద నెపం నెట్టి రాజకీయ లబ్ధిపొందాలనుకోవడం హేయమైన చర్య అని ఎద్దేవా చేశారు. పిల్లలు చనిపోయే అంతవరకు వస్తుంటే ఇంటెలిజెన్స్ వ్యవస్త ఏం చేస్తుందని ప్రశ్నించారు. సీఎం రేవంత్ సొంత జిల్లా నారాయణపేటలోని ఒక్క ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనే మూడుసార్లు ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగిన స్పందన కరువైందన్నారు. సస్పెండ్ అయిన నారాయణపేట డీఈవో మహ్మద్ అబ్దుల్ ఘనీకి ప్రభుత్వం వనపర్తి జిల్లా డీఈవోగా అదనపు పోస్టింగ్ ఇచ్చి, ఒక్క రోజులోనే బాధ్యతలు అప్పజెప్పిందన్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనలతో విద్యార్థులు అవస్థలు పడుతుంటే ఆకునూరి మురళి, కోదండరాం వంటి విద్యావేత్తలు ఎందుకు స్పందించడం లేదని ఎద్దేవా చేశారు.
గత సీఎం కేసీఆర్ మనవడు.. హిమాన్షుతో గచ్చిబౌలి కేశవనగర్‌లో ప్రాథమిక పాఠశాలలో టాయిలెట్లు కూడా లేవని, సౌకర్యాలు లేవని దత్తత తీసుకుని కోటి రూపాయల నిధులిచ్చి, మొసలికన్నీరు కార్చి ఆ ఒక్క స్కూల్ తప్పితే మిగతా స్కూళ్లలో సౌకర్యాలు కల్పించలేదన్నారు. ఇప్పుడు కేసీఆర్ దారిలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుస్తున్నారన్నారు. వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ మృతిపై తామెందుకు కారణమంటూ రాష్ట్ర మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడరని ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ మాటలు చూస్తుంటే ఆయనకు మతిభ్రమించినట్లు కనపడుతోంది. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ డిపాజిట్లు కోల్పోవడంతో ఇంకా షాక్ నుంచి తేరుకోలేదన్నారు. పరిపాలనలో బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలవి ఒకే తీరు వ్యవహారం నడుస్తుందన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము ను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెడితే కాంగ్రెస్-బీఆర్ఎస్ లు కలిసి వ్యతిరేకించి, యశ్వంత్ సిన్హాకు మద్దుతుగా ప్రచారం చేశారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒక్కటేనని తేలిపోయిందన్నారు. ఈ సమావేశంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ , పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కట్టా సుధాకర్ , తదితరులు పాల్గొన్నారు.