ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఈసీ ప్రెస్‌మీట్.. ఎందుకంటే..?

by Mahesh |   ( Updated:2025-01-07 04:20:17.0  )
ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఈసీ ప్రెస్‌మీట్.. ఎందుకంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎన్నికల సంఘం(Election Commission) ప్రెస్ మీట్(Press meet) ఏర్పాటు చేయనుంది. ఇందులో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Elections) తేదీలు ప్రకటించనుంది. ఫిబ్రవరి 15 తో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ కాలం(Assembly period) ముగియనుంది. దీంతో ఆ లోపే ఎన్నికలు పూర్తి చేసి.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఎన్నికల సంఘం(Election Commission) ముందుకు సాగుతుంది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు.. బీజేపీ(BJP), ఆప్‌(AAP), కాంగ్రెస్(congress) పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీ(Capital Delhi) ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలతో మార్మోగి పోతుండగా.. అధికారంలో ఉన్న AAP పార్టీ ముందస్తుగానే ప్రచారం చేస్తుంది.


మరోసారి అధికారమే లక్ష్యంగా చేసుకొని ఢిల్లీ ప్రజలపై వరాల జల్లు కురిపిస్తుంది. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ సారి ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగురవేయాలని చూస్తుంది. ఈ క్రమంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ.. ప్రచారంలో దుసుకుపోతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా తాము కూడా పోటీలో ఉన్నామని ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ(BJP), ఆప్ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీలో ఉన్న అన్ని ఎంపీ స్థానాల్లో(all MP positions) బీజేపీ కైవసం చేసుకోవడంతో..ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ(bjp)నే విజయం సాధించే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed