Harish Rao : పోలీసుల జీవితాలకే 'భద్రత' లేకపోవడం సిగ్గు చేటు : హరీష్ రావు

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-01-08 07:04:51.0  )
Harish Rao : పోలీసుల జీవితాలకే భద్రత లేకపోవడం సిగ్గు చేటు : హరీష్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : హోంమంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాలనలో ప్రజల ప్రాణాలు కాపాడే(Saving People's Lives) పోలీసుల(Police Lifes)) జీవితాలకే 'భద్రత'(Safety)లేకుండా పోవడం సిగ్గు చేటని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు (Harish Rao)ఎక్స్ వేదికగా విమర్శించారు. రిటైర్డ్ పోలీసు ఉద్యోగి (ASI) సాధిక్ అలీ 8 నెలల నుంచి తనకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఎదురుచూస్తున్నానని, ఇక అతహత్యే శరణ్యం అంటూ ఆవేదన చెందుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని హరీష్ రావు తప్పుబట్టారు.

సాదిక్ అలీ వీడియోను పోస్టు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన అన్ని వర్గాలతో పాటు రిటైర్మెంట్ ఉద్యోగులకు కూడా శాపంగా మారిందని విమర్శించారు. విశ్రాంత జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపే రోజుల్లో వారిని మానసిక క్షోభకు గురి చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. దాదాపు 7,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు వారికి హక్కుగా రావలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకుంటే గాని రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందలేని దుస్థితికి విశ్రాంత ఉద్యోగులను నెట్టడం శోచనీయమన్నారు.

మరోవైపు నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించక ఉద్యోగులకు, జర్నలిస్టులకు, పోలీసులకు వైద్యం అందించే ఇహెచ్ఎస్, జేహెచ్ఎస్, ఆరోగ్య భద్రత పథకాలను సేవలను సైతం అటకెక్కించే పరిస్థితి కల్పించారని, అత్యవసర వైద్య సేవలు అందకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి వెంటనే బకాయిలు చెల్లించి, ఉద్యోగులు, జర్నలిస్టులు, పోలీసులకు వైద్య సేవలు కొనసాగేలా చూడాలని, రిటైర్మెంట్ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న బెన్ఫిట్స్ ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు తెలిపారు.

అలాగే విజయవంతంగా ఉద్యోగాలు పూర్తిచేసి, జీవితంలో విజయం సాధించిన ఉద్యోగుల సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కావని..పోరాడి పరిష్కారం చేసుకుందామని..మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని హరీష్ రావు భరోసా ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed