- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రమాదాలను నివారించేందుకే మాసోత్సవాలు..: మెదక్ అడిషనల్ ఎస్పీ
దిశ,మెదక్ టౌన్ : జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాల్లో భాగంగా బుధవారం మెదక్ ఆర్టీసీ బస్ స్టాప్ ఆవరణలో డిపో మేనేజర్ సురేఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అడిషనల్ ఎస్పీ మహేందర్ పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాలను నివారించేందుకు జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు.
ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. రోడ్డు భద్రతా నియమాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. అన్ని దానాలలో గొప్ప దానం రక్తదానమని ప్రతి ఒక్కరు రక్తదానం చేసినట్లయితే మరొకరి ప్రాణం నిలిపిన వారు అవుతారని అన్నారు. వేగం వద్దు ప్రాణం ముద్దు అనే నినాదంతో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంవీఐ లు శ్రీనివాస్, శ్రీలేఖ, డిపో అసిస్టెంట్ మేనేజర్ వీరబాబు, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.